Denmark Open Super Series Premier badminton tournament
-
37 ఏళ్ల నిరీక్షణకు తెర.. తెలుగు తేజం సంచలనం
ఒడెన్స్: 37 ఏళ్ల నిరీక్షణకు తెలుగు తేజం తెరదించాడు. ప్రతిష్టాత్మక డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ సాధించాడు. ఆదివారం రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 21-10, 21-5 తేడాతో 37 ఏళ్ల లీ హున్ ఇల్ (దక్షిణ కొరియా)పై వరుస సెట్లలో గెలుపొందాడు. డెన్మార్క్ సూపర్ సిరీస్ విజేతలో నిలవడంతో భాగంగా.. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ను ఓడించిన ఈ తెలుగు తేజం సెమీస్‌లోనూ వరుస గేముల్లో తన ప్రత్యర్థి వోంగ్ వింగ్ కీ విన్సెంట్‌ను చిత్తు చేసిన విజయం తెలిసిందే. టైటిల్ పోరులోనూ అదే పోరాట పటిమను ప్రదర్శించిన తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ వరుస సెట్లలో దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్థి లీ హున్ ఇల్ కు పోరాడే అవకాశమూ ఇవ్వలేదు. 1980లో ప్రకాశ్ పదుకొనె తర్వాత ఈ మెగా టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ తరఫున ఫైనల్‌కు చేరిన రెండో క్రీడాకారుడిగా శ్రీకాంత్ గుర్తింపు పొందాడు. 1980లో ప్రకాశ్ పదుకొనె ఈ టోర్నీలో విజేతగా నిలవగా, 37 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ శ్రీకాంత్ ఈ సూపర్ సిరీస్‌ను సొంతం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత్ తరఫున సైనా నెహ్వాల్ (2012లో) టైటిల్ నెగ్గగా... పీవీ సింధు (2015లో) రన్నరప్‌గా నిలిచింది. -
సూపర్ శ్రీకాంత్
ఈ సీజన్లో తన అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్ స్టార్కిడాంబి శ్రీకాంత్ నాలుగో సూపర్ సిరీస్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ను ఓడించిన ఈ తెలుగు తేజం అదే జోరును సెమీస్‌లోనూ కనబరిచాడు. వరుస గేముల్లో తన ప్రత్యర్థి వోంగ్ వింగ్ కీ విన్సెంట్‌ను చిత్తు చేసి టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. నేటి ఫైనల్స్ రాత్రి గం. 7.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం ఒడెన్స్: 37 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ... ప్రతిష్టాత్మక డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ శ్రీకాంత్ 21–18, 21–17తో ప్రపంచ 15వ ర్యాంకర్ వోంగ్ వింగ్ కీ విన్సెంట్ (హాంకాంగ్)పై గెలుపొందాడు. గతంలో వీరిద్దరూ నాలుగుసార్లు తలపడగా... చెరో రెండుసార్లు గెలిచారు. ఈ నాలుగు మ్యాచ్‌లు కూడా మూడు గేమ్‌లపాటు జరగడం గమనార్హం. అయితే ఈసారి శ్రీకాంత్ పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ వరుసగా రెండు గేముల్లో విజయాన్ని ఖాయం చేసుకోవడం విశేషం. ఆదివారం జరిగే ఫైనల్లో 37 ఏళ్ల లీ హున్ ఇల్ (దక్షిణ కొరియా)తో శ్రీకాంత్ తలపడతాడు. రెండో సెమీఫైనల్లో లీ హున్ ఇల్ 25–23, 18–21, 21–17తో టాప్ సీడ్ సన్ వాన్ హో (కొరియా)పై గెలిచాడు. లీ హున్ ఇల్, శ్రీకాంత్ ముఖాముఖిగా తలపడనుండటం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన శ్రీకాంత్ సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో రన్నరప్‌గా నిలిచాడు. 1980లో ప్రకాశ్ పదుకొనె తర్వాత ఈ మెగా టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ తరఫున ఫైనల్‌కు చేరిన రెండో క్రీడాకారుడిగా శ్రీకాంత్ గుర్తింపు పొందాడు. 1980లో ప్రకాశ్ పదుకొనె ఈ టోర్నీలో విజేతగా కూడా నిలిచాడు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత్ తరఫున సైనా నెహ్వాల్ (2012లో) టైటిల్ నెగ్గగా... పీవీ సింధు (2015లో) రన్నరప్‌గా నిలిచింది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ అక్సెల్సన్ను ఓడించి ఆత్మవిశ్వాసంతో ఉన్న శ్రీకాంత్ సెమీస్‌లోనూ నిలకడగా రాణించాడు. విన్సెంట్‌ను తక్కువ అంచనా వేయకుండా ఆడుతూ తొలి గేమ్ ఆరంభంలో 11–6తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత విన్సెంట్ తేరుకునే ప్రయత్నం చేసినా శ్రీకాంత్ అతని ఆశలను ఆవిరి చేశాడు. రెండో గేమ్‌లోనూ దూకుడుగా ఆడిన శ్రీకాంత్ 4–0తో ముందంజ వేశాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని దక్కించుకున్నాడు. ‘చాలా గొప్పగా అనిపిస్తోంది. మంచి ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఆడాను. ఇద్దరి ఆటతీరు ఒకేలా ఉన్నప్పటికీ నేను ఓపికతో ఆడాను. ఆరంభంలో కొన్ని తప్పిదాలు చేసినా వెంటనే వాటిని సరిదిద్దుకున్నాను. ఫైనల్ ప్రత్యర్థి లీ హున్‌తో ఇప్పటివరకు ఆడలేదు. అతడితో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశముంది’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. -
శ్రీకాంత్ సంచలనం
-
శ్రీకాంత్ సంచలనం
ఒడెన్స్: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లోనూ అదరగొడుతున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ శ్రీకాంత్ 14–21, 22–20, 21–7తో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)ను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ గెలుపుతో ఈ ఏడాది అక్సెల్సన్ చేతిలో జపాన్ ఓపెన్‌లో, ఇండియా ఓపెన్‌లో తనకు ఎదురైన పరాజయాలకు ఈ హైదరాబాద్ ప్లేయర్ ప్రతీకారం తీర్చుకున్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో హెచ్ఎస్ ప్రణయ్ (భారత్) 13–21, 18–21తో టాప్ సీడ్ సన్ వాన్ హో (కొరియా) చేతిలో ఓడిపోయాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో శ్రీకాంత్ 21–13, 8–21, 21–18తో జియోన్ హయోక్ జిన్ (కొరియా)పై నెగ్గగా... ప్రణయ్ 21–17, 11–21, 21–19తో మలేసియా దిగ్గజం, మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీపై సంచలన విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. సైనా 10–21, 13–21తో కేవలం 29 నిమిషాల్లో అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడింది. భారత స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్ పీవీ సింధు తొలి రౌండ్లో 17–21, 21–23తో చెన్ యుఫె (చైనా) చేతిలో ఓడిపోయింది. -
సింధు సంచలనం
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు సంచలనం సృష్టించింది. ప్రపంచ నాలుగో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ హైదరాబాద్ అమ్మాయి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. కేవలం 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 21-12, 21-15తో తై జు యింగ్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గతంలో తై జు యింగ్ చేతిలో మూడుసార్లు ఓడిపోయిన సింధు ఈసారి ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. రెండు గేముల్లోనూ ఆరంభంలో కాస్త పోటీ ఎదుర్కొన్న సింధు మ్యాచ్ సాగుతున్నకొద్దీ పైచేయి సాధించింది. క్వార్టర్ ఫైనల్లో మాజీ నంబర్‌వన్ యిహాన్ వాంగ్ (చైనా)తో సింధు ఆడుతుంది.