ఆస్ట్రేలియాతో ఇక్కడ వాకా స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు బావుమా అద్భుతమైన డైవ్తో చేసిన రనౌట్ మ్యాచ్ కే హైలెట్. ఆదివారం నాల్గో రోజు ఆటలో భాగంగా ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ పరుగు కోసం బ్యాటింగ్ ఎండ్లోకి వెళుతున్న సమయంలో బావుమా బౌలర్ ఎండ్ నుంచి పరుగెత్తుకొచ్చి బంతిని అందుకున్నాడు. అంతే వేగంగా బంతిని సూటిగా వికెట్లవైపు విసిరాడు. దాంతో బెయిల్స్ కిందపడటం, వార్నర్ అవుట్ కావడం చకచకా జరిగిపోయాయి.