సీరియస్‌గా షాపింగ్ మాల్లో ఎటో చూస్తూ నడుస్తూ ఉంటారు. సడెన్‌గా మీరు వేసుకున్న చెప్పులు పట్టుజారీ కింద పడబోయారనుకోండి. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది. ఎవరైనా చూశారా? అనుకుంటూ... సిగ్గుతో తలదించుకుంటా. తాజాగా ఇదే పరిస్థితి బాలీవుడ్ నటి కాజోల్‌కు ఎదురైంది. ఓ ప్రముఖ షాపింగ్ మాల్‌లో షాపింగ్‌కు వెళ్లిన నటి, సడన్‌గా తన హీల్స్ పట్టుజారీ కింద పడిపోయారు. దీంతో వెంటనే ఆమె పక్కన ఉన్న ఓ బాడీగార్డు కాజోల్‌కు ఎలాంటి దెబ్బలు తగ్గలకుండా.. పట్టుకున్నాడు. ఈ ఘటన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. దీన్ని చూసిన కాజోల్ అభిమానులు షాక్ అవుతున్నారు. హెల్త్ గ్లో స్టోర్‌లోని ఈవెంట్లో పాల్గొనడానికి ఫోనిక్స్ మార్కెట్ సిటీ మాల్‌కు కాజోల్ వెళ్లారు.