సుజిత్ సర్కార్ దర్శకత్వంలో వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతున్న సెన్సిబుల్ మూవీ ‘ఆక్టోబర్’.. ఇప్పటికే ఈ సినిమా ఫొటోలు, పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. తన ట్రైనింగ్‌లో భాగంగా ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో పనిచేసే హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థిగా ఈ సినిమాలో వరుణ్ కనిపిస్తాడు. బాలీవుడ్‌లో ఆరంగేట్రం చేస్తున్న బనిత సంధూ ఈ సినిమాలో వరుణ్ క్లాస్‌మేట్‌గా కనిపించనుంది.