Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Sakshi Editorial On TDP alliance Red Book Conspiracy1
ఎర్రబుక్కు తెల్లమొహం!

ఎర్ర పుస్తకం తెల్లమొహం వేసినట్లయింది. రాజ్యాంగ విధి విధానాలను కూడా ప్రైవేటీకరించబోయిన తెంపరితనానికి చెంపలు వాయించినట్లయింది. ఇష్టారీతిన పోలీసు రాజ్యాన్ని నడుపుతామంటే, పౌరహక్కుల్ని చిదిమేస్తామంటే అంగీకరించేది లేదని ఇప్పటికే పలుమార్లు ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయ స్థానం ప్రభుత్వ యంత్రాంగాన్ని హెచ్చరించింది. ఇప్పుడదే హెచ్చరికను జనతా న్యాయస్థానం కూడా జారీ చేసినట్లయింది. రాష్ట్రంలో 56 మండల పరిషత్తు అధ్యక్ష ఉపాధ్యక్ష స్థానాలకు, కడప జిల్లా పరిషత్తు అధ్యక్ష స్థానానికి మొన్న ఉపఎన్నికలు జరిగాయి. ఓట్లు వేసింది ఎంపీటీసీలు, జడ్‌పీటీసీలే. వీరు క్షేత్రస్థాయి ప్రజా ప్రతినిధులు. జనం గుండె చప్పుళ్లను నిరంతరం వినగలిగేవాళ్లు. ప్రజల నాడీ స్పందనను ముందుగా పసిగట్టగలిగేవాళ్లు.ఉపఎన్నికల్లో అధికార కూటమి పన్నిన వ్యూహం ఫలించ లేదు. విపక్షమైన వైసీపీ ఘనవిజయాన్ని నమోదు చేసింది. కడప జడ్‌పీతో సహా 40 స్థానాలను ఆ పార్టీ అవలీలగా గెలవగలిగింది. కూటమికి 10 స్థానాలు దక్కాయి. మిగిలినచోట్ల ఎన్నిక వాయిదా పడింది. వైసీపీ టిక్కెట్‌పై గెలుపొందిన స్థానిక ప్రతినిధులు ఆ పార్టీ పక్షాన్నే నిలవడంలో వింతేముందని ఇప్పుడు కూటమి చిలుకలు పలుకుతుండవచ్చు. కానీ ఏపీలో ఈ తొమ్మిది నెలల పూర్వరంగం అర్థమైన వారికి వైసీపీ గెలుపులో వింతే కాదు, అద్భుతం కూడా కనిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకంలో బలంగా వేళ్లూనుకున్న పార్టీ వైసీపీ. ఆ సంగతి కూటమి నేతలకు స్పష్టంగా తెలుసు. అందుకే కూటమి కట్టుకున్నారు. కుయుక్తులను ఆశ్రయించారు. ఎన్నికల్లో ఈ కూటమి చేసిన దుష్ప్రచారం, వెదజల్లిన విషం, పలికిన అసత్యాలు, చేసిన బూటకపు బాసలు అనే నిచ్చెనమెట్ల మీదుగా చేరుకున్న అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రతిపక్ష పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయాలనే సంకల్పానికి అధికార కూటమి వచ్చినట్టు దాని చర్యలు నిరూపిస్తున్నాయి. ఇటువంటి ప్రయ త్నాలు సత్ఫలితాలనివ్వవని గతంలో అనేక గుణపాఠాలు న్నాయి. అయినా అధికార మత్తులో ఉన్నప్పుడు అవి స్ఫురించక పోవచ్చు. ‘తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు.... ... కానీ మూర్ఖుని మనసును సమాధానపరచడం మాత్రం సాధ్యంకాద’ని భర్తృహరి చెప్పిన సుభాషితం మనకు ఉండనే ఉన్నది.ప్రభుత్వ వైఖరిని విమర్శించిన వారి మీద, ఎన్నికల హామీలను అమలు చేయలేదేమని అడిగిన వారి మీద వందలాది కేసులు నమోదయ్యాయి. టెర్రరిస్టుల మీద పెట్టాల్సిన కేసులను సోషల్‌ మీడియా విమర్శకుల మీద ఎందుకు పెడు తున్నారని హైకోర్టు ప్రశ్నిస్తున్నా పోలీసు యంత్రాంగం ఖాతరు చేయడం లేదు. రక్షక భటులే అర్ధరాత్రి పూట సివిల్‌ డ్రెస్సుల్లో ఇళ్లలోకి చొరబడి విమర్శకులను బరబరా లాక్కొని వెళ్తున్నారని, రాష్ట్రమంతటా తిప్పుతున్నారనీ, కుటుంబ సభ్యులకు సమా చారం కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలు తరచుగా వినిపి స్తున్నాయి. పోసాని కృష్ణమురళి పదేళ్ల కింద ప్రెస్‌మీట్‌లో చేసిన విమర్శలపై టెర్రరిస్టు కేసు పెట్టి జైల్లోకి నెట్టారు. నడివీధుల్లో విపక్ష కార్యకర్తలను విచ్చుకత్తులతో నరుకుతున్న దృశ్యాల వీడియోలను చూడవలసి వచ్చింది. ప్రైవేట్‌ ఆస్తుల మీద దాడులు జరిగాయి. పార్టీ ఆఫీసులను కూల్చేశారు. పంట చేల విధ్వంసం జరిగింది. పండిన తోటలను నరికేశారు. మీడియా మీద అప్రకటిత సెన్సార్‌షిప్‌ అమలైంది. తమకు గిట్టని వార్తా చానెళ్ల ప్రసారాలను నిలిపివేసేలా కేబుల్‌ ఆపరేటర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చారు.ఈ నేపథ్యంలో వచ్చిన స్థానిక ఉపఎన్నికల సందర్భంగా కూటమి నాయకత్వం మరింత రెచ్చిపోయింది. స్థానిక ప్రతి నిధులను లొంగదీసుకోవడానికి సామ దాన భేద దండో పాయాలను ప్రయోగించారు. ప్రలోభాల ఎరలు వేశారు. కేసులు పెడతామని బెదిరించారు. ఉపాధిని దెబ్బతీస్తామని హెచ్చరించారు. పోలీసు యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని స్వయంగా ప్రభుత్వమే అధికార జులుమ్‌కు దిగినప్పుడు స్థానిక ప్రతినిధులను లొంగదీసుకోవడం పెద్ద విశేషమేమీ కాదు. పైగా రాజ్యసభల్లో, శాసన మండళ్లలో అధికార హోదాలు వెలగబెట్టిన బడాబడా ఆసాములే సర్కార్‌ కొరడా ముందు సాగిలపడి పోయిన ఉదంతాలు కళ్లముందటే కనిపిస్తున్నాయి. స్థానిక పదవులను గెలుచుకోవడానికి అధికార పార్టీ బరి తెగించిందనీ, పలుచోట్ల ప్రతినిధులను అడ్డుకున్నారనీ, ప్రలోభపెట్టారనీ ‘సాక్షి’ మీడియానే కాదు, ‘ప్రజాశక్తి’ పత్రిక కూడా రాసింది. ఇలా అధికార యంత్రాంగం బరితెగించి ప్రవర్తించినప్పుడు స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ స్వీప్‌ చేయడం కష్టం కాదనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. కానీ, వైసీపీ స్థానిక ప్రతినిధులు అరుదైన ప్రజాస్వామిక చైతన్యాన్ని ప్రదర్శించారు. పరిశీలకులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. నిర్బంధాలను ధిక్క రించి తమను నమ్మి గెలిపించిన పార్టీ పక్షానే దృఢంగా నిలబడ్డారు. తమ పదవులేమీ ప్రభావం చూపగలిగేంత పెద్దవి కాదు. అయినా సరే విశ్వసనీయతకే వారు పట్టం కట్టారు. గోడ దూకిన బడా ఆసాములు ఈ పరిణామం తర్వాత ఎలా తలెత్తుకుంటారో చూడాలి. ‘స్టేట్‌ టెర్రరిజమ్‌’ అనదగ్గ స్థాయిలో నిర్బంధకాండను ప్రయోగించినా ఈ క్షేత్రస్థాయి ప్రతినిధులు దృఢంగా నిలవడానికి రెండు ముఖ్యమైన కారణాలు కనిపి స్తున్నాయి. మొదటిది – రెండు నెలల క్రితం పార్టీ కార్య కర్తలనుద్దేశించి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగం. కార్యకర్తలెవరూ అధైర్యపడవలసిన అవసరం లేదనీ, వారికి తాను అండగా నిలబడతాననీ ప్రకటించారు. జగనన్న 2.0 కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తాడో చేసి చూపెడతానని భరోసా ఇచ్చారు.జగన్‌ ప్రకటన తర్వాత గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యకర్తలకు మంచి ప్రేరణ లభించిందనీ, వారు ధైర్యంగా నిలబడుతున్నారనీ వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రెండో ప్రధాన కారణం – క్షేత్రస్థాయి వాస్తవికత. ఎన్నికలకు ముందు చంద్రబాబు కూటమి చేసిన బూటకపు హామీల బండారం ప్రజ లందరికీ అర్థమైంది. వైసీపీ సర్కార్‌ మీదా, జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగతంగా కూటమి చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలేనని ప్రజాశ్రేణులు ఇప్పుడు భావిస్తున్నాయి. మోసపోయామన్న భావన వారిని వెంటాడుతున్నది. ప్రభుత్వంపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతున్నది. వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి భయపడటం లేదు. బహిరంగంగానే కూటమి సర్కార్‌ను విమర్శిస్తున్నారు. ఈ పరిణామం కూడా వైసీపీ కార్యకర్తలు ఎదురొడ్డి నిలబడేందుకు దోహదపడింది.జనంలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా కూటమి సర్కార్‌ తన ధోరణిని మార్చుకోకపోగా అదే అసత్య ప్రచారాన్ని మరింత ఎక్కువగా ఆశ్రయిస్తున్నది. తేలిపోయిన ఆరోపణల్నే మళ్లీ మళ్లీ ఎక్కుపెడుతున్నారు. చంద్రబాబు చెబుతున్న అప్పుల లెక్కల్ని గుర్తు చేసుకుంటూ జనం నవ్వుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో జోకులు పేలుతున్నాయి. శనివారం నాడు జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా అలవాటు ప్రకారం అప్పుల కథను మరోసారి వినిపించారు. ఎన్నికల ప్రచారంలో 14 లక్షల కోట్లున్న అప్పు, గవర్నర్‌ ప్రసంగంలో 10 లక్షల కోట్లుగా మారి, బడ్జెట్‌ ప్రసంగంలో ఏడు లక్షల కోట్లుగా రూపాంతరం చెంది, ఆవిర్భావ సభలో తొమ్మిదిన్నర లక్షల కోట్లుగా పరిణామం చెందింది.అప్పుల కథతోపాటు అసలు విషయాన్ని కూడా ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు. ‘‘బయట నుండి (ప్రభుత్వంలోకి రాకముందు) చూసినప్పుడు ‘సూపర్‌ సిక్స్‌’ హామీలను అమలు చేయవచ్చని అనుకున్నా, ఇప్పుడు చూస్తే తొమ్మిదిన్నర లక్షల కోట్ల అప్పుంది. దీనిపై వడ్డీ కట్టాలి. ఇప్పుడు సంక్షేమాన్ని అమలుచేస్తే మధ్యలోనే ఆగిపోతుంది. కనుక ముందుగా అభివృద్ధి చేసి, వచ్చే ఆదాయంతో సంక్షేమం చేద్దా’’మని ఈ సభలో చెప్పుకొచ్చారు.ఈ తూచ్‌ మంత్రాన్ని ఆయన ఆవిర్భావ సభలో మాత్రమే చెప్పలేదు. ఈ వార్షిక బడ్జెట్‌లో కూడా ఆయన దీన్ని పొందు పరిచారు. కాకపోతే అంకెల్లో చెప్పడం వల్ల సరిగ్గా అర్థం కాలేదు. ‘సూపర్‌ సిక్స్‌’గా పేర్కొన్న ఆరు అంశాలను ఆయన చెప్పి నట్టుగా అమలు చేస్తే 70 వేల కోట్ల పైచిలుకు నిధులు అవసరమవుతాయని అంచనా. అయితే బడ్జెట్‌ కేటాయింపుల్లో మాత్రం 17 వేల కోట్లు మాత్రమే చూపెట్టారు. కేటాయింపు చూపినంత మాత్రాన అమలు చేస్తారని అర్థం కాదు. గత బడ్జెట్‌లో కూడా ‘తల్లికి వందనం’, ‘అన్నదాతా సుఖీభవ’ పథకాలకు అరకొర కేటాయింపులు చూపెట్టారు. కానీ,అందులో అణా పైసలు కూడా ఖర్చుపెట్టలేదన్నది జనం అనుభవంలోకి వచ్చిన సత్యం.మొన్నటి మంగళవారం జోలెతో పాడుకున్న వేలంతో కలిపి తొమ్మిదిన్నర మాసాల్లో బాబు సర్కార్‌ ఒక లక్షా 52 వేల కోట్ల పైచిలుకు అప్పులు చేసి జాతీయ రికార్డును నెలకొల్పింది. ప్రభుత్వం నేరుగా చేసిన అప్పు 98,088 కోట్లయితే, ష్యూరిటీ సంతకం పెట్టి కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు 23,700 కోట్లు, ఇక రాజధాని పేరుతో ఇప్పటివరకు చేసిన అప్పు 31,000 కోట్లు. వెరసి 1,52,788 కోట్లు. ఇంతటి జగదేక అప్పారావు ప్రభుత్వం జగన్‌ సర్కార్‌ను అప్పులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రచారం చేయబూనడాన్ని దాష్టీకం అనాలో, దగుల్బాజీతనం అనాలో తెలుసుకోవాలి. ఈ అప్పుల చిట్టా వ్యవహారం ఇక ఎంతమాత్రమూ దాచేస్తే దాగేది కాదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఇస్తున్న సమాచారాన్ని బట్టి, కాగ్‌ రిపోర్టుల ఆధారంగా, బడ్జెట్‌ పత్రాల సాక్షిగా జనంలోకి వాస్తవాలు వస్తున్నాయి. రాష్ట్రాన్ని జగన్‌ ప్రభుత్వం అప్పుల కుప్ప చేసిందన్న ప్రచారాన్ని ఇప్పుడెవ్వరూ నమ్మడం లేదు.జగన్‌ ప్రభుత్వ హయాంలో విధ్వంసం జరిగిందనే మాట చంద్రబాబుకు ఊతపదంగా మారింది. చివరికి కలెక్టర్ల సమా వేశంలో కూడా ‘గత ప్రభుత్వం విధ్వంసం చేసింద’ని మాట్లా డారు. ఇలా కలెక్టర్ల సమావేశాన్ని రాజకీయాలకు వాడుకున్న ముఖ్యమంత్రి ఈయన తప్ప మరొకరు ఉండకపోవచ్చు. తాను చెప్పిందే వేదం, తన పచ్చ కోడి కూస్తేనే సమాచారం తెలిసేది అనే భ్రమల్లోంచి ఆయనింకా బయటపడలేదు. పదేపదే అబద్ధాన్ని వల్లెవేస్తే అది నిజమైపోతుందనే పాతకాలపు గోబెల్స్‌ థియరీని పట్టుకొని వేళ్లాడుతున్నారు. ఇప్పుడు విధ్వంసం గురించి ఎక్కువ మాట్లాడితే జనం రికార్డుల్ని తిరగేస్తారు.విధ్వంసం ఎవరిదో వికాసం ఎవరి వల్ల జరిగిందో తెలుసుకుంటారు. సమాచారం ఇప్పుడు ఎవరి ప్రైవేట్‌ ప్రాపర్టీ కాదు. అది ప్రజల హక్కు.పౌరుల భావప్రకటనా స్వేచ్ఛపై శుక్రవారం నాడు సర్వో న్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అధికార మత్తులో జోగుతున్న మన వ్యవస్థలకు కనువిప్పు కావాలి. భావ ప్రకటనా స్వాతంత్య్రం లేనినాడు రాజ్యాంగం హామీ పడిన గౌరవ ప్రదమైన జీవన హక్కు సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేటతెల్లం చేసింది. ఈ హక్కును రక్షించడంలో పోలీసులు విఫలమైతే ఆ బాధ్యతను కోర్టులు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు హితవు చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇమ్రాన్‌ ప్రతాప్‌గఢీ అనే కాంగ్రెస్‌ ఎంపీ పెట్టిన పోస్టుపై గుజరాత్‌ పోలీసులు పెట్టిన కేసును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఈ తీర్పుపై సంపాదకీయం రాసిన ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ ‘కేసును కొట్టివేయడంలో ఆశ్చర్యం లేదు. అసలు సుప్రీంకోర్టు దాకా ఈ కేసు రావడమే దిగ్భ్రాంతిని కలిగిస్తు న్నద’ని వ్యాఖ్యానించింది. ప్రతాప్‌గఢీ పెట్టిన పోస్టుకూ,ఆంధ్రాలో ప్రేమ్‌ కుమార్‌ అనే దళిత యువకుడి సోషల్‌ మీడియా పోస్టుకూ సారూప్యతలున్నాయి. కానీ ఆ యువకుడిని మన పోలీసు యంత్రాంగం ఎంతగా వేధించిందో తెలిసిందే. ఇప్పటి కైనా పోలీస్‌ యంత్రాంగం జీ హుజూర్‌ పద్ధతుల్ని విడిచి పెట్టక పోతే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని గ్రహిస్తే మంచిది. పోలీసు యంత్రాంగానికే కాదు... రెడ్‌బుక్‌ వంటి గ్రంథాల రచయితలకు కూడా సుప్రీం వ్యాఖ్యలు వాతలు పెట్టినట్టే!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com

YS Jagan Ugadi Wishes To All Telugu People2
తెలుగువారికి వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు

తాడేపల్లి: రేపు తెలుగు సంవత్సరాది(ఉగాది) పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, రాష్ట్రం సుబిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని ఆయన అభిలషించారు. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని వైఎస్ జగన్ తన సందేశంలో ఆకాంక్షించారు.

Fine Rice Free distribution to ration card holders in Telangana3
Telangana: పేదలందరికీ.. సన్నబియ్యం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పేదలందరికీ సన్న బియ్యం ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రేషన్‌ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఉగాది రోజున ప్రారంభం కానుంది. ఆహార భద్రతా కార్డులు కలిగిన వారికి ఇప్పటివరకు ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దొడ్డు బియ్యం దురి్వనియోగంతో.. వేల కోట్ల రూపాయల సబ్సిడీ భరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా ఇప్పటివరకు పంపిణీ చేస్తున్న బియ్యంలో 85 శాతానికి పైగా దుర్వినియోగం అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దొడ్డు బియ్యాన్ని తినేందుకు ఇష్టపడని పేద, మధ్య తరగతి వర్గాలు పెద్ద సంఖ్యలో రేషన్‌ దుకాణాల నుంచి తీసుకున్న బియ్యాన్ని ఆ సమీపంలోనే దళారులకు కిలో రూ.10 నుంచి 13 రూపాయలకు విక్రయించడం, లేదంటే డీలర్ల నుంచి అసలు బియ్యం తీసుకోకుండా అతను ఇచ్చిన మొత్తం తీసుకుని వెళ్లడం జరిగేది. ఈ నేపథ్యంలోనే దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావించింది. దీనిపై రేషన్‌కార్డులు, సన్న బియ్యం పంపిణీపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. ప్రజలు తినని దొడ్డు బియ్యాన్ని రూ.10,665 కోట్లు వెచ్చించి పంపిణీ చేయడం కంటే అదనంగా మరో రూ.2,800 కోట్లు వెచ్చించి సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల ఉచిత బియ్యం పథకం సద్వినియోగం అవుతుందని తేల్చింది. ఈ మేరకు సన్న బియ్యం పంపిణీకి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సన్న బియ్యం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి, ఏప్రిల్‌ నెల కోటాను ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. నెలకు 2 ఎల్‌ఎంటీలు అవసరం నెలకు 2 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యం అవసరం కానున్నాయి. ఈ నేపథ్యంలో గత వానాకాలం సీజన్‌లో 4.41 లక్షల మంది రైతుల నుంచి సేకరించిన 24 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీల) సన్న ధాన్యాన్ని గత డిసెంబర్‌ నుంచే మిల్లింగ్‌ చేయించడం ప్రారంభించడం ద్వారా ఆరు నెలలకు సరిపడా సన్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆదీనంలోని గోడౌన్‌లలో నిల్వ చేసిన బియ్యాన్ని ఏప్రిల్‌ 1 నుంచి పంపిణీ చేసేందుకు వీలుగా మండల స్థాయి స్టాక్‌ (ఎంఎల్‌ఎస్‌) పాయింట్లకు పంపించింది. రాష్ట్రంలో 2.85 కోట్ల లబ్ధిదారులకు పంపిణీ చేసే సన్న బియ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు రూ.10,665 కోట్లు సబ్సిడీ రూపంలో భరిస్తున్నాయి. సన్న బియ్యం పంపిణీ కారణంగా ఇకపై రూ.13,522 కోట్లు భరించాల్సి వస్తుంది. ఇందులో కేంద్రం రూ.5,489 కోట్లు భరిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.2,800 కోట్ల భారం పడడంతో భరించాల్సిన రాయితీ రూ.8,033 కోట్లకు పెరిగింది. త్వరలోనే మరో 30 లక్షల మంది పీడీఎస్‌ నెట్‌వర్క్‌లోకి.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డులకు తోడు కొత్త కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 30 లక్షల మందిని అర్హులుగా ప్రాథమిక పరిశీలనలో తేల్చారు. ఇందులో 18 లక్షల దరఖాస్తులు ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లు చేర్చడం (అడిషన్స్‌) గురించి కాగా.. వీరందరినీ అర్హులుగా గుర్తించి ఇప్పటికే ఆన్‌లైన్‌లో చేర్పుల జాబితాలో పొందుపరిచినట్లు తెలిసింది. జాబితాలో పేర్లు ఉన్నవారికి కూడా సన్న బియ్యం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. మరో 12 లక్షల మందిని (సుమారు 4 లక్షల కుటుంబాలు) కూడా రేషన్‌కార్డులకు అర్హులుగా జాబితాల్లో చేర్చాలని పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. వీరందరికీ కొత్తగా 4 నుంచి 5 లక్షల కార్డుల వరకు అవసరమని అంచనా వేశారు. కొత్త లబ్ధిదారుల చేరికతో సన్నబియ్యం వినియోగించుకునే వారి సంఖ్య 3.10 కోట్లకు పెరగనుంది. అలాగే కార్డుల సంఖ్య 94 లక్షలకు చేరే అవకాశం ఉంది. 84 % మందికి నెలకు 6 కిలోల చొప్పున ⇒ రాష్ట్రంలో ప్రస్తుతం 89.73 లక్షల ఆహార భద్రతా కార్డులు ఉండగా, వాటిలో 2.85 కోట్ల లబ్ధిదారులు నమోదై ఉన్నారు. ఇకనుంచి వీరందరికీ నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకం కింద సుమారు 35 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ గత మూడేళ్లుగా సన్న బియ్యంతోనే భోజనాన్ని వడ్డిస్తున్నారు. వీరు కాకుండా ఐసీడీఎస్‌ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని 84 శాతం మందికి సన్న బియ్యం పంపిణీ అవుతాయని, దొడ్డు బియ్యం వినియోగం దాదాపు జీరో అవుతుందని చెబుతున్నారు.

Hyderabad Central University Students Protest Against Land Issue4
హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు

హైదరాబాద్: హెచ్‌సీయూ భూముల వ్యవహారం మరోసారి ఉద్రిక్తతలకు దారి తీసింది. వర్శిటీ భూముల విక్రయాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్శిటీ భూముల విక్రయాన్ని ఆపాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు. దాంతో సెంట్రల్ యూనివర్శిటీలో పోలీసుల్ని భారీగా మోహరించారు.అసలు వివాదం ఎందుకంటే..!హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ భూములను ఎప్పటికప్పుడు ఏదో సాకు చూపి వెనక్కు లాక్కుంటున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వర్సిటీ ఏర్పడిన 50 ఏళ్లలో దాదాపు 500 ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్నారని అంటున్నారు. మొదట 2300 ఎకరాల్లో హెచ్‌సీయూను ఏర్పాటు చేయగా.. ఇప్పుడు యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని ఆరోపిస్తున్నారు.తాజాగా టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు నిర్ణయించడంతో విద్యార్థి సంఘాలు, వర్కర్లు, టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పోరాటానికి దిగారు. వీరంతా జేఏసీగా ఏర్పడి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. మరోవైపు ఈ స్థలం హెచ్‌సీయూది కాదని, అందుకే కోర్టు తీర్పు మేరకే అభివృద్ధి చేసేందుకు 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే జరిగితే ఇక మిగిలేది 1400 ఎకరాలు మాత్రమే.హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, హెచ్‌సీయూ భూములు (HCU Lands) వర్సిటీ అవసరాలకే వినియోగించేలా చొరవ చూపాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. చుట్టూ ఐటీ కారిడార్‌ ఉండడంతో ఈ భూముల విక్రయం ద్వారా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 400 ఎకరాలను విక్రయిస్తే మార్కెట్‌ విలువ ప్రకారం రూ.10 వేల కోట్లు వస్తుందని ప్రభుత్వ అంచనా వేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

IPL 2025: Gujarat titans vs Mumbai indians live updates and highlights5
ముంబైపై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025 MI vs GT live updates and highlights: ముంబైపై గుజరాత్ టైటాన్స్ విజయంఐపీఎల్‌-2025లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది.ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్‌(48) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిలక్ వర్మ(39) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా చేతులేత్తేశాడు. 17 బంతుల్లో 11 పరుగులు చేసిన హార్దిక్ ముంబై ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడు.ముంబై ఐదో వికెట్ డౌన్‌..సూర్య‌కుమార్ యాద‌వ్ రూపంలో ముంబై ఇండియ‌న్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 48 ప‌రుగులు చేసిన సూర్య.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 24 బంతుల్లో 77 పరుగులు కావాలి. క్రీజులోకి నమాన్ ధీర్ వచ్చాడు.ముంబై మూడో వికెట్‌ డౌన్‌..తిలక్‌ వర్మ రూపంలో ముంబై ఇండియన్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 39 పరుగులు చేసిన తిలక్‌ వర్మ.. ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా రాబిన్‌ మింజ్‌ వచ్చాడు. ముంబై విజయానికి 50 బంతుల్లో 100 పరుగులు కావాలి. క్రీజులో సూర్య‌కుమార్ యాద‌వ్‌(37) ఉన్నారు.9 ఓవర్లకు ముంబై ఇండియన్స్‌ స్కోర్‌: 86/29 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ముంబై ఇండియ‌న్స్ 2 వికెట్ల న‌ష్టానికి 80 ప‌రుగులు చేసింది. క్రీజులో సూర్య‌కుమార్ యాద‌వ్‌(25), తిల‌క్ వ‌ర్మ‌(35) ఉన్నారు.సిరాజ్ ఆన్ ఫైర్‌.. ముంబై రెండో వికెట్ డౌన్‌ర్యాన్ రికెల్ట‌న్ రూపంలో ముంబై ఇండియ‌న్స్ రెండో వికెట్ కోల్పోయింది. 6 ప‌రుగులు చేసిన రికెల్ట‌న్‌.. సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ చేశాడు. 5 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ముంబై.. రెండు వికెట్ల న‌ష్టానికి 44 ప‌రుగులు చేసింది. క్రీజులో తిల‌క్ వ‌ర్మ‌(18), సూర్య‌కుమార్‌(8) ఉన్నారు.రోహిత్ శ‌ర్మ ఔట్‌.. ముంబై తొలి వికెట్ డౌన్‌రోహిత్ శ‌ర్మ రూపంలో ముంబై ఇండియ‌న్స్ తొలి వికెట్ కోల్పోయింది. 8 ప‌రుగులు చేసిన రోహిత్ శ‌ర్మ‌.. మ‌హ్మ‌ద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి తిల‌క్ వ‌ర్మ వ‌చ్చాడు.సుద‌ర్శ‌న్ హాఫ్ సెంచ‌రీ.. ముంబై ముందు భారీ టార్గెట్‌అహ్మ‌దాబాద్ వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ బ్యాట‌ర్లు స‌మిష్ట‌గా రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 196 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో సాయిసుద‌ర్శ‌న్‌(63) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. శుబ్‌మ‌న్ గిల్‌(38), జోస్ బ‌ట్ల‌ర్‌(39) రాణించారు. ముంబై బౌల‌ర్ల‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. బౌల్ట్‌, దీప‌క్ చాహ‌ర్‌, ముజీబ్ త‌లా వికెట్ సాధించారు.19 ఓవ‌ర్లకు గుజ‌రాత్ స్కోర్‌: 186/6గుజ‌రాత్ టైటాన్స్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. 18 ఓవ‌ర్‌లో ఆఖ‌రి బంతికి బౌల్ట్ బౌలింగ్‌లో సుద‌ర్శ‌న్(63) ఔట్ కాగా.. 19 ఓవ‌ర్‌లో వ‌రుస క్ర‌మంలో రాహుల్ తెవాటియా, రూథ‌ర్ ఫ‌ర్డ్ ఔట‌య్యారు. 19 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ 6 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగులు చేసింది.గుజ‌రాత్ మూడో వికెట్ డౌన్‌.. షారూఖ్ ఔట్‌షారూఖ్ ఖాన్ రూపంలో గుజ‌రాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 9 ప‌రుగులు చేసిన షారూఖ్‌.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ మూడు వికెట్ల న‌ష్టానికి 151 ప‌రుగులు చేసింది.గుజ‌రాత్ రెండో వికెట్ డౌన్‌..జోస్ బ‌ట్ల‌ర్ రూపంలో గుజ‌రాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 39 ప‌రుగులు చేసిన బట్ల‌ర్.. ముజీబ్ ఉర్ రెహ్మ‌న్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ రెండు వికెట్ల న‌ష్టానికి 134 ప‌రుగులు చేసింది. క్రీజులో సాయిసుద‌ర్శ‌న్‌(49), షారూఖ్ ఖాన్‌(0) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న జోస్‌ బట్ల‌ర్‌..12 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ వికెట్ న‌ష్టానికి 109 ప‌రుగులు చేసింది. క్రీజులో సాయి సుద‌ర్శ‌న్‌(42), బ‌ట్ల‌ర్‌(26) ఉన్నారు.తొలి వికెట్ డౌన్‌.. శుబ్‌మ‌న్ గిల్ ఔట్‌శుబ్‌మ‌న్ గిల్ రూపంలో గుజ‌రాత్ తొలి వికెట్ కోల్పోయింది. 38 ప‌రుగులు చేసిన గిల్‌.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి జోస్ బ‌ట్ల‌ర్ వ‌చ్చాడు. 9 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ వికెట్ న‌ష్టానికి 79 ప‌రుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న గిల్‌, సుద‌ర్శ‌న్‌గుజ‌రాత్ టైటాన్స్ ఓపెన‌ర్లు సాయిసుద‌ర్శ‌న్‌(32), శుబ్‌మ‌న్ గిల్‌(32) దూకుడుగా ఆడుతున్నారు. 6 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ వికెట్ న‌ష్టానికి 66 ప‌రుగులు చేసింది.నిల‌క‌డ‌గా ఆడుతున్న గుజ‌రాత్ ఓపెన‌ర్లుటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజ‌రాత్ టైటాన్స్ వికెట్ న‌ష్ట‌పోకుండా 26 ప‌రుగులు చేసింది. క్రీజులో ఓపెన‌ర్లు శుబ్‌మ‌న్ గిల్‌(13), సాయిసుద‌ర్శ‌న్‌(13) ఉన్నారు.ఐపీఎల్‌-2025లో అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు. గుజ‌రాత్ మాత్రం త‌మ జ‌ట్టులో ఎటువంటి మార్పులు చేయ‌లేదు.తుది జ‌ట్లుముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, సత్యనారాయణ రాజు, ముజీబ్ ఉర్ రెహమాన్, ట్రెంట్ బౌల్ట్గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభమన్ గిల్ (కెప్టెన్‌), B సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీప‌ర్‌), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ

Ex High Court Judge Acquitted In Chandigarh 20086
16 ఏళ్ల నిరీక్షణ.. నిర్దోషిగా హైకోర్టు మాజీ జడ్జి

చంఢీగడ్: అదొక పదహారేళ్ల క్రితం కేసు.. అందులోనూ హైప్రొహైల్ కేసు. ఒక జస్టిస్‌ తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవడానికి సుదీర్ఘకాలం వేచి చూసిన కేసు. హర్యానా జడ్జిగా పని చేసిన జస్టిస్ నిర్మలా యాదవ్.. భారీగా అక్రమాలకు పాల్పడ్డారనే కేసు. అయితే ఆ కేసు సుదీర్ఘంగా విచారణ చేసింది సీబీఐ. చివరకు ఆ కేసులో నిర్మలా యాదవ్ ఎటువంటి తప్పుచేయలేదని తేలడంతో ఆమెకు బిగ్ రీలీఫ్ లభించింది. తాజాగా సీబీఐ కోర్టు.. ఆమెను నిర్దోషిగా తేల్చి తీర్పును వెలువరించింది. 2008 జరిగిన ఈ కేసులో తీర్పు తనకు అనుకూలంగా రావడంతో జస్టిస్ నిర్మలా యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. విచారణలో భాగంగా ఈరోజు(శనివారం) సీబీఐ కోర్టుకు హాజరైన ఆమె.. తీర్పు తర్వాత మాట్లాడారు. తనకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందని, అందుకే ఇంతకాలం ఓపిక పట్టిన దానికి ప్రతిఫలం లభించిందన్నారు. ఒక జడ్జికి ఇవ్వబోయి.. మరొక జడ్జికి క్యాష్ డెలివరీఆ ఇదర్దు జడ్జి పేర్లు ఇంచుమించు ఒకే మాదిరి ఉంటాయి. ఒకరు నిర్మలా యాదవ్ అయితే మరొకకే నిర్మలాజిత్ కౌర్. అయితే హర్యానా మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ సంజీవ్ బన్సాల్ క్లర్క్.. ఓ రూ. 15 లక్షల నగదును ప్యాక్ చేసుకుని నిర్మలా యాదవ్ ఇంటికి వెళ్లినట్లు విచారణలో తేలింది. తాను ఇవ్వాల్సింది జస్టిస్ నిర్మలాజిత్ కౌర్ కని కాకపోతే పొరపాటున జస్టిస్ నిర్మలా యాదవ్ ఇంటికి వెళ్లినట్లు తెలిపాడు ఆ ప్యాక్ తీసుకెళ్లిన అప్పటి క్లర్క్. రోజుల వ్యవధిలో ఆమెపై రెండు ఎఫ్ఐఆర్‌లుఈ కేసుకు సంబంధించి 2008, ఆగస్టు 16వ తేదీన ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ఆ తర్వాత మళ్లీ ఓ కీలక మలుపు తీసుకుంది. అప్పటి యూనియన్ టెర్రిటరీ జనరల్ ఎస్ఎఫ్ రోడ్రిగ్స్ ఆదేశాలతో ఆ కేసును సీబీఐకి బదిలీ చేశారు. దాంతో 12 రోజుల వ్యవధిలో సీబీఐ మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.2009 జనవరిలో సీబీఐ విచారణ ప్రారంభంజస్టిస్ నిర్మలా యాదవ్ పై వచ్చిన అవినీతి ఆరోపణల్లో దర్యాప్తు చేపట్టేందుకు తమకు అనుమతి కావాలంటూ పంజాబ్, హర్యానా హైకోర్టుకు విజ‍్క్షప్తి చేసింది సీబీఐ. దీనికి అనుమతి లభించడంతో జస్టిస్ నిర్మలా యాదవ్ పై విచారణ చేపట్టింది సీబీఐ. 2011లో ఆమెపై చార్జిషీట్ నమోదు చేసింది సీబీఐ.దీనిలో భాగంగా మొత్తం 84 మంది సాక్షులను పేర్లను నమోదు చేసింది. ఇందులో 69 మందిని విచారించిన సీబీఐ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 10 మంది సాక్షులను తిరిగి విచారించడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే 10 మంది కీలక సాక్షులను మళ్లీ విచారించారు. చివరకు ఆ రూ. 15 లక్షల కేసులో జస్టిల్ నిర్మలా యాదవ్ పాత్ర ఏమీ లేదని తేలడంతో ఆమె నిర్దోషిగా నిరూపితమయ్యారు.

Actress Trisha Krishnan Says Love Always Win7
ఎప్పుడూ ప్రేమే గెలుస్తుంది.. త్రిష పోస్ట్‌కు అర్థమేంటో?

త్రిష (Trisha Krishnan).. తెలుగులోనే కాదు తమిళంలోనూ టాప్‌ హీరోయిన్‌. ఈమధ్య తన హవా కాస్త తగ్గింది కానీ ఒకప్పుడు ఆమె తెరపై కనిపిస్తే విజిల్స్‌ పడాల్సిందే! గత కొన్నేళ్లుగా సినిమాల సంఖ్య తగ్గించేసిన ఈ బ్యూటీ ఈ ఏడాది మాత్రం చేతి నిండా చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉంది. ఆమె నటించిన ఐడెంటిటీ, విడాముయర్చి ఇప్పటికే రిలీజయ్యాయి. ‍ప్రస్తుతం గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ, థగ్‌ లైఫ్‌, విశ్వంభర, రామ్‌.. సహా సూర్య 45వ సినిమాలో నటిస్తోంది.ప్రేమదే విజయంతాజాగా త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో చేతి ఉంగరాన్ని చూపిస్తూ ఓ ఫోటో షేర్‌ చేసింది. దీనికి 'ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది' అన్న క్యాప్షన్‌ను జోడించింది. ఆ ఫోటోలో త్రిష ఆకుపచ్చ చీర ధరించి ఉంది. ముక్కుపుడక, మల్లెపూలతో సాంప్రదాయంగా ముస్తాబైంది. చెవికమ్మలకు మ్యాచ్‌ అయ్యే ఉంగరం ధరించింది. ఇది చూసిన కొందరు ఎంగేజ్‌మెంట్‌ జరిగిందా? లేదా పెళ్లికి రెడీ అని హింట్‌ ఇస్తుందా? అని ఆరా తీస్తున్నారు.పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌?తమిళ హీరో విజయ్‌తో త్రిష ప్రేమలో ఉన్నట్లు కొన్నేళ్లుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో వీరిద్దరూ జీవితాంతం కలిసుందామని ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే త్రిష.. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అల్లరి బుల్లోడు, అతడు, పౌర్ణమి, సైనికుడు, స్టాలిన్‌, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, బుజ్జిగాడు, నమో వెంకటేశా.. వంటి పలు చిత్రాలతో తెలుగువారి మనసులో స్థానం సంపాదించుకుంది. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) చదవండి: చరణ్‌ బర్త్‌డే వేడుకల్లో నాగార్జున.. కనిపించని అల్లు ఫ్యామిలీ

Sell two helmets with every two wheeler says Nitin Gadkari8
బైక్‌ కొంటే రెండు హెల్మెట్లు తప్పనిసరి

దేశంలో రహదారి భద్రతను మెరుగుపరిచే దిశగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ టూవీలర్‌ విక్రేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని ద్విచక్ర వాహనాలను తప్పనిసరిగా రెండు ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్లతో విక్రయించాలని ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన ఆటో సమ్మిట్ లో చేసిన ఈ ప్రకటనను ఐఎస్ఐ హెల్మెట్ తయారీదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశంలోని అతిపెద్ద సంస్థ టూ వీలర్ హెల్మెట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీహెచ్ఎంఏ) సంపూర్ణంగా సమర్థించింది.రోడ్డు ప్రమాదాలను నివారించడానికి గడ్కరీ ఆదేశాలను కీలకమైన, దీర్ఘకాలిక చర్యగా భావిస్తున్నారు. ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్లను తప్పనిసరిగా వాడాలని ఎప్పటి నుంచో వాదిస్తున్న హెల్మెట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ మంత్రి క్రియాశీల నాయకత్వాన్ని ప్రశంసించింది. 'ఇది కేవలం రెగ్యులేషన్ మాత్రమే కాదు. ఇది జాతీయ అవసరం. ప్రమాదాల్లో ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాలకు ఈ ఆదేశం భవిష్యత్తులో ఇటువంటి నష్టాలను నివారించగలదనే ఆశను కలిగిస్తుంది" అని టీహెచ్ఎంఏ అధ్యక్షుడు రాజీవ్ కపూర్ అన్నారు.హెల్మెట్ లేకపోవడం వల్లే..దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4,80,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 1,88,000 మరణాలు నమోదవుతున్నాయి. ఈ గణాంకాలు భారతదేశ రహదారి భద్రత భయంకరమైన పరిస్థితిని తెలియజేస్తున్నాయి. 66 శాతం ప్రమాదాలలో బాధితులు 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులే. ఏటా 69 వేలకు పైగా ద్విచక్ర వాహన ప్రమాద మరణాలు సంభవిస్తుండగా వీటిలో 50 శాతం హెల్మెట్ లేకపోవడం వల్ల సంభవిస్తున్నాయి. ద్విచక్ర వాహనాల ప్రయాణాలు ఇకపై ప్రమాదకరంగా ఉండకూడదని పరిశ్రమ నొక్కి చెప్పింది.

Hyderabad Metro Train Timings Extended From April 1st9
హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని మెట్రో ప్రయాణికులకు ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి గుడ్‌న్యూస్‌ చెప్పారు. మెట్రో సమయం పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకే అందుబాటులో ఉన్న మెట్రో సేవల సమయం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.ఇకపై ఏప్రిల్‌ 1 నుంచి రాత్రి 11.45 గంటల వరకు మెట్రో సర్వీసులు నడవనున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఈ మారిన వేళలు అమల్లో ఉంటాయని తెలిపారు.కాగా, ప్రస్తుతం విద్యార్థులకు ఇస్తున్న ఆఫర్ మరో ఏడాది పొడిగించారు. విద్యార్థుల 20 ట్రిప్పుల డబ్బులతో 30 ట్రిప్పులు వెళ్లే ఆఫర్ పొడిగిస్తున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. సూపర్ సేవర్ హాలిడే ఆఫర్, ఆఫ్-పీక్ వేళల్లో స్మార్ట్ కార్డులపై ఇచ్చే తగ్గింపు మార్చి 31తో ముగియనుంది. తాజాగా ఈ ఆఫర్‌ను మరో ఏడాది పొడిగిస్తూ మెట్రో నిర్ణయం తీసుకుంది. 2026 మార్చి 31 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని మెట్రో ఎండీ పేర్కొన్నారు.

US revoked Hundreds of international students Visas in Overnight Details10
విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు

వాషింగ్టన్‌: అమెరికాలో విదేశీ విద్యార్థులపై డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం మరో బాంబు వేసింది. వందల మంది విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ రాత్రికి రాత్రే వీసా రద్దు మెయిల్స్‌​ పంపినట్లు కథనాలు వెలువడుతున్నాయి. వీసాలు రద్దయిన విద్యార్థులు తక్షణమే దేశాన్ని వీడాలని లేదంటే బలవంతంగా తరలిస్తామని ఆ మెయిల్స్‌లో హెచ్చరించింది. వీసాలు రద్దైన వాళ్లలో కొందరు భారతీయ విద్యార్థులు కూడా ఉన్నట్లు సమాచారం. యూనివర్సిటీలలో జరిగిన వివిధ ఆందోళనల్లో క్రియాశీలంగా వ్యవహరించిన అమెరికాలోని విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగ శాఖ మెయిల్స్‌ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ‘బ్యూరో ఆఫ్‌ కాన్సులర్‌ అఫైర్స్‌ వీసా’ నుంచి విదేశీ విద్యార్థులకు ఈమెయిల్స్ వెళ్తున్నాయి. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఈమెయిల్స్‌ పంపింది. కేవలం ఆందోళనల్లో పాల్గొన్నవారికే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన విద్యార్థులకు.. ఆఖరికి ఆ పోస్టులకు లైకులు కొట్టినవాళ్లకు కూడా ఈ హెచ్చరికలు పంపించింది.‘‘యునైటెడ్ స్టేట్స్‌ ఇమిగ్రేషన్, అమెరికా జాతీయచట్టంలోని సెక్షన్‌ 221(జీ) ప్రకారం.. మీ వీసా రద్దయింది. ఈ మేరకు స్టూడెంట్‌ ఎక్చ్సేంజ్‌ విజిటర్‌ ప్రోగ్రామ్‌కు బాధ్యత వహించే అధికారులకు సమాచారం వెళ్లింది. మీ వీసా రద్దు అంశం గురించి సంబంధిత కళాశాల యాజమాన్యానికి వారు తెలియజేయవచ్చు’’హెచ్చరిక సందేశాలు వచ్చినవారు.. తమ స్వదేశాలకు వెళ్లేందుకు సీబీపీ హోమ్‌ యాప్‌ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ చర్యతో.. ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉండటం వల్ల కలిగే పరిణామాలు, భావ ప్రకటనా స్వేచ్ఛ పరిమితులపై ఆందోళన రేకెత్తుతోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement