Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Shocking Reason Behind GV Reddy Resign1
GV Reddy : జీవీ రెడ్డి రాజీనామా వెనక అసలు కారణం అదే

సాక్షి, విజయవాడ : ఏపీ ఫైబర్ నెట్‌లో రచ్చ తారాస్థాయికి చేరింది. ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌గా ఉన్న జీవీ రెడ్డి సోమవారం తన పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జీవీరెడ్డి చంద్రబాబుకు లేఖ రాశారు. కానీ వ్యక్తిగత కారణలతో కాదని సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌ తిట్టడం వల్లే జీవీరెడ్డి బయటకు వచ్చినట్లు సమాచారం. ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌గా ఉన్నా సరే వేమూరి హరికృష్ణ మాట వినాలని జీవీరెడ్డికి చంద్రబాబు, నారా లోకేష్‌ ఆదేశాలు జారీ చేశారు. వేమూరి హరికృష్ణ పెత్తనం సహించలేక, వేమూరి హరికృష్ణ మాట విననందుకు చంద్రబాబు, లోకేష్‌ తిట్టడంతో జీవీరెడ్డి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ జీవీ రెడ్డి రాజీనామా అనంతరం ఫైబర్‌నెట్‌లో ఎండీ దినేష్ కుమార్‌పై ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఫైబర్ నెట్‌తో పాటు ఆర్‌టీజీఎస్‌, ఏపీ గ్యాస్ ఇన్ఫ్రా కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్ బాధ్యతల నుండి తప్పించింది. జీఏడిలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్త్వులు జారీ చేసింది.

Ysrcp Chief Ys Jagan Meeting With Party Mlas Mlcs Updates2
ప్రజల పక్షాన పోరాడితే గెలుపు మనదే: వైఎస్‌ జగన్‌

సాక్షి,తాడేపల్లి: క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు. అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేసి బయటికి వచ్చిన తర్వాత సోమవారం(ఫిబ్రవరి24) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ‘మనం యుద్ధ రంగంలో ఉన్నాం, విజయం దిశగా అడుగులు వేయాలి. ప్రజా సమస్యల విషయంలో రాజీలేని పోరాటం చేయాలి. నిజాయితీ, చిత్తశుద్ధితో ప్రజల తరఫున పోరాటం చేయాలి.ప్రజలకు తోడుగా, ప్రజల్లో ఉంటే గెలుపు సాధించినట్టే. అందుకనే ప్రజాసమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయొద్దు. ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ నేను భరోసా ఇస్తున్నాను, అండగా ఉంటా.ప్రతిపక్షంలో మన సమర్థతను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం. పార్టీకోసం, ప్రజలకోసం గట్టిగా పనిచేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. కళ్లుమూసుకుని, తెరిచేలోగా ఏడాది గడిచిపోతోంది. జమిలి ఎన్నికలు అంటున్నారు. అదే జరిగితే ఎన్నికలు మరింత ముందుగా వస్తాయి. అందుకే ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా రాజీ వద్దు. ప్రజల తరఫున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మనం విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నాం కాబట్టే ఎన్నో క్లిష్టపరిస్థితులను అధిగమించాం. ఇంత దూరం ప్రయాణం చేశాం. అసెంబ్లీలో మనం తప్ప వేరే ప్రతిపక్షం లేదు. ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లాం. ప్రతిపక్షహోదా ఇస్తే.. హక్కుగా మనకు సమయం ఇవ్వాల్సి వస్తుంది. సభా నాయకుడితో దాదాపు సమాన స్థాయిలో సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే ప్రతిపక్ష హోదాను ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. నేను ఏ అంశంపై మాట్లాడినా నిందలకు, దూషణలకు దూరం. ప్రతి అంశాన్నీ ఆధారాలు, రుజువులతో మాట్లాడతాను. అసెంబ్లీలో ఎలాగూ అవకాశం లేదు కాబట్టి ప్రెస్‌మీట్లలో ప్రజలకు వివరిస్తున్నాను. కౌన్సిల్‌లో మంచి మెజార్టీ ఉంది. దీన్ని వినియోగించుకోవాలి’ అని వైఎస్‌ జగన్‌ సూచించారు.అన్యాయంగా ఇళ్లపట్టాలు రద్దు చేస్తున్నారు: వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుమన ప్రభుత్వ హయాంలో 31 లక్షలమందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని వైఎస్‌ జగన్‌ అన్నారు. ‘పార్టీలు చూడకుండా, పక్షపాతం లేకుండా ఇళ్లపట్టాలు ఇచ్చాం, ఎవరైనా ఇళ్లుకట్టుకోకపోతే ప్రభుత్వం వారికి ఇళ్లు మంజూరుచేసి ఇవ్వాలి. అంతేగాని, పేదలపై కక్ష కట్టి పట్టాలు రద్దుచేయడం ఏంటి? పట్టాలు రద్దు చేస్తే తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాం. ఎవరు ఇళ్లస్థలాలు ఇచ్చారో, ఎవరు కాలనీలు ఏర్పాటు చేశారో ప్రజలకు తెలుసు. విజయవాడలో అంబేద్కర్‌ స్మృతి వనాన్ని మనం నిర్మించాం. కాని పేరు తీసేయాలన్న ఉద్దేశంతో ఏకంగా అంబేద్కర్‌ విగ్రహంమీదే దాడికి దిగారు. ప్రభుత్వం ఆదేశాలతో ఏకంగా అధికారులే దీనికి ఒడిగట్టారు. స్మృతివనం ఎవరు కట్టారో ప్రజలకు తెలియదా?’ అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

Infosys Postpones Employee Assessments Amidst Layoff Controversy3
ఇన్ఫోసిస్‌ యూటర్న్‌..

ఉద్యోగుల తొలగింపులపై దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ (Infosys) దూకుడు తగ్గించింది. ఉద్యోగులు నేర్చుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ తన రాబోయే ఉద్యోగుల మదింపులను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ నిర్ణయం సరికొత్త ఎత్తుగడ అని, ఇటీవలి తొలగింపుల (Layoff) నుండి దృష్టిని మరల్చడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని ఎంప్లాయీ వెల్ఫేర్ గ్రూప్ నాజెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ఆరోపించింది.తొలగింపుల నేపథ్యంఇన్ఫోసిస్ ఫిబ్రవరి 7న 700 మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో ప్రధానంగా 2022 ఇంజనీరింగ్ బ్యాచ్‌కు చెందిన ఫ్రెషర్స్ ఉన్నారు. వీరు ఇప్పటికే ఆన్‌బోర్డింగ్‌లో రెండు సంవత్సరాల ఆలస్యాన్ని ఎదుర్కొన్నారు. అంతర్గత మదింపుల ఆధారంగా ఈ తొలగింపులు జరిగినట్లు సమాచారం. అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి సదరు ఉద్యోగులకు మూడు అవకాశాలు ఇచ్చినట్లు కంపెనీ చెబుతోంది. అయితే తొలగింపునకు గురైన ఉద్యోగులు దీనిని ఖండిస్తున్నారు. అసెస్ మెంట్ సిలబస్ ను మధ్యలోనే మార్చారని, ముందస్తు సమాచారం లేకుండానే చాలా మందికి తొలగింపు నోటీసులు వచ్చాయని ఆరోపిస్తున్నారు.ఎన్ఐటీఈఎస్ స్పందన..ఇన్ఫోసిస్ చర్యలను విమర్శిస్తూ, తొలగింపులు కార్మిక హక్కుల ఉల్లంఘనగా ఎన్ఐటీఈఎస్ అభివర్ణించింది.. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. ఎన్ఐటీఈఎస్ అధ్యక్షుడు హర్ప్రీత్ సింగ్ సలూజా మాట్లాడుతూ, మదింపులను ఆలస్యం చేయాలని తీసుకున్న ఆకస్మిక నిర్ణయం తొలగింపులపై మరింత వివాదం కొనసాగకుండా కప్పిపుచ్చుకోవడానికేనని విమర్శించారు.ఇన్ఫోసిస్ సమర్థనఉద్యోగులకు అదనపు ప్రిపరేషన్ సమయాన్ని అందించడమే లక్ష్యంగా మదింపులను వాయిదా వేస్తున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. కంపెనీ తమ అన్ని కార్యకలాపాలలో సమ్మతి, పారదర్శకతను పాటించడంలో తమ నిబద్ధతను నొక్కి చెప్పింది. ఇన్ఫోసిస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ షాజీ మాథ్యూ మాట్లాడుతూ.. కంపెనీ కార్మిక శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, వారి విచారణలకు సహకరిస్తూ అవసరమైన సమాచారాన్ని అందిస్తోందని తెలిపారు.ఉద్యోగులపై ప్రభావం..మదింపులను నిరవధికంగా వాయిదా వేయడం చాలా మంది ఉద్యోగులను వారి భవిష్యత్తుపై మరింత అనిశ్చితికి గురిచేసింది. ఆయా అంశాల్లో నిపుణులతో అదనపు శిక్షణ, ఇతర సహకారం అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చినప్పటికీ, ఉద్యోగులకు మాత్రం ఆందోళన తొలగడం లేదు. ఉద్యోగుల తొలగింపు, మదింపుల వాయిదాతో తలెత్తిన వివాదం భారత ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై దేశవ్యాప్తంగా చర్చలకు దారితీసింది.

APUWJ Condemns Restriction Of Few Media Channels Over Assembly Sessions4
మీడియాపై పక్షపాత ధోరణి సమంజసం కాదు: ఏపీయూడబ్యూజే

విజయవాడ: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కొన్ని పత్రికలు, చానెళ్లపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విదించడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్యూజే) తప్పుబట్టింది. మీడియాపై ఆంక్షలు, పక్షపాత ధోరణి సరికాదని స్పష్టం చేసింది. అసెంబ్లీ కవరేజీకి అందరికీ అవకాశమివ్వాలని స్పష్టం చేసింది. దీనిపై స్పీకర్, ప్రభుత్వం పునరాలోచించాలని పేర్కొంది. కొన్ని పత్రికలు, చానెళ్లను అసెంబ్లీ సమావేశాల కవరేజ్ కు అనుమతించకపోవడం సరికాదని తెలిపింది, పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్యూజే పేర్కొంది.‘సాక్షి’తో సహా నాలుగ చానెళ్లపై ఆంక్షలుఏపీ అసెంబ్లీ సమావేశాల కవరేజ్ లో నూ ఏపీ ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. అసెంబ్లీ సమావేశాలను కవరేజ్ అంశానికి సంబంధించి ‘సాక్షి’తో సహా నాలుగు చానెళ్లపై ఆంక్షలు విధించింది. దేశంలో ఏ అసెంబ్లీ చరిత్రలో లేని మీడియాపై నిషేధ ఆజ్ఞలు అములు చేస్తోంది చంద్రబాబు సర్కారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మీడియాపై ఆంక్షలు విధించింది. కూటమి కుట్రలు బయటపడతాయని ‘సాక్షి’తో పాటు నాలుగు చానెళ్లను నిషేధించింది. అసెంబ్లీలో జరుగుతున్నది ప్రజలకు చూపించకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఈ కుట్రలు తెరలేపింది.

Shocking Truth Behind Doctor Sumanth Reddy case in Warangal5
డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం కేసు .. దారి తప్పిన ఓ భార్య కథ

సాక్షి, హైదరాబాద్‌ : వాళ్లిద్దరూ భార్య భర్తలు. ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. దంపతులిద్దరూ సమాజంలో గౌరవప్రదమైన డాక్టర్‌, లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, లెక్చరర్‌గా విద్యాబుద్ధులు నేర్పించే భార్య పక్కదారి పట్టింది. దారుణానికి ఒడిగట్టింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు ప్లాన్ చేసింది. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ముందస్తు ప్లాన్‌ ప్రకారం, అనుకున్నట్లుగా భర్త చనిపోకపోవడంతో చివరికి పోలీసులకు పట్టుబడింది. దోషిగా కటకటాల్లోకి వెళ్లనుంది.రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ డాక్టర్ సుమంత్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో అసలు సూత్రదారి, పాత్రదారి బాధితుడి భార్య ఫ్లోరా మరియా అని తేలడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. మంగళవారం నిందితులను పోలీసులు మీడియా ఎదుట హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.పోలీసుల వివరాల మేరకు, డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరా మరియాలు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కాజీపేటలో సుమంత్ క్లినిక్‌ను నిర్వహిస్తుండగా, అతని భార్య ఫ్లోరా మరియా రంగశాయిపేటలో డిగ్రీ లెక్చరర్‌గా పనిచేస్తోంది. అయితే, క్లినిక్ ప్రారంభించకముందు ఓ ఆస్పత్రిలో డాక్టర్‌గా సుమంత్ పనిచేసేవారు. ఆ సమయంలో ఫ్లోరా మరియా ఓ జిమ్‌లో చేరింది. అక్కడే ఆమెకు సామెల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఆ విషయం సుమంత్‌కు తెలిసిపోవడంతో భార్య ఫ్లోరాను మందలించాడు.అయినా, ఆమె వినిపించుకోలేదు. భర్తను వద్దనుకొని, ప్రియుడే కావాలని అనుకున్న ఆమె, చివరికి భర్తను అడ్డొదగొట్టాలని అనుకుంది. ఇందుకోసం ప్రియుడు సామెల్‌, అతని స్నేహితుడు ఏఆర్‌ కానిస్టేబుల్‌ రాజును ఆమె పురమాయించింది. నేరం చేస్తే మట్టికి అంటకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో భర్తను ఎక్కడ, ఎలా హత్య చేయాలో ఫ్లోరా చెప్పింది.సుమంత్‌ను చంపి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కెచ్ వేసింది. ప్లాన్‌ ప్రకారం, యాక్సిడెంట్ ప్లాన్ విఫలమయ్యాక, ప్లాన్‌ బీ ప్రకారం ఈ నెల 20న రాత్రి ఖాజీపేట నుండి బట్టుపల్లి బైపాస్ రహదారిలో సమంత్‌ కారును అడ్డగించి, అతడిపై ఐరన్‌ రాడ్లతో దాడి చేశారు. చనిపోయాడనుకున్న తర్వాత నిందితులు పరారయ్యారు. కానీ చావుబతుకుల మధ్య ఉన్న బాధితుణ్ని స్థానికులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సుమంత్‌పై జరిగిన హత్యాయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో కట్టుకున్న భార్య ఫ్లోరా మరియా, ఆమె ప్రియుడు సామెల్, సామెల్‌ స్నేహితుడు ఏఆర్‌ కానిస్టేబుల్‌ రాజు నిందితులని తేలింది. మంగళవారం నిందితులను పోలీసులు మీడియా ఎదుట హాజరుపరచి, హత్యయత్నానికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు.

Shubman Gill Gets Big Praise From Ex India Stars6
కోహ్లి, రోహిత్‌ మర్రిచెట్టు లాంటి వాళ్లు.. అయినా అతడు ఎదుగుతున్నాడు!

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ శుబ్‌మ‌న్ గిల్(Shubman Gill) త‌న సూప‌ర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 తొలి మ్యాచ్‌లో సెంచ‌రీతో మెరిసిన గిల్‌.. ఆదివారం పాకిస్తాన్‌తో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లోనూ స‌త్తాచాటాడు. 52 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు.గిల్‌ క్రీజులో ఉన్నంతసేపు తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. ఈ క్ర‌మంలో గిల్‌పై భార‌త మాజీ క్రికెట‌ర్లు సంజయ్ బంగర్, నవజ్యోత్ సింగ్ సిద్దూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. రాబోయే రోజుల్లో భార‌త జ‌ట్టు బ్యాటింగ్ ఎటాక్‌ను గిల్ లీడ్ చేస్తాడ‌ని వారిద్ద‌రూ కొనియాడారు."శుబ్‌మ‌న్ గిల్ ఒక అద్బుతం. త‌న కెరీర్ ఆరంభం నుంచే అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. త‌న రెండున్నర ఏళ్ల వ‌న్డే క్రికెట్ కెరీర్‌లో ఎన్నో మైలు రాయిల‌ను సాధించాడు. ప్ర‌పంచ నంబ‌ర్‌-1 బ్యాట‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. అత‌డి బ్యాటింగ్ టెక్నిక్ కూడా చాలా బాగుంది.స్ట్రెయిట్ డ్రైవ్, ఆన్-డ్రైవ్ షాట్ల‌ను అద్బుతంగా ఆడుతున్నాడు. మిడ్-ఆఫ్, మిడ్ ఆన్ ఫీల్డ‌ర్లు 30 యార్డ్ స‌ర్కిల్ ఉన్న‌ప్ప‌టికి వారి మ‌ధ్య నుంచి బంతిని బౌండ‌రీకు త‌ర‌లిస్తున్నాడు. అత‌డు క‌చ్చితంగా రాబోయే రోజుల్లో భారత బ్యాటింగ్ యూనిట్‌కు వెన్న‌ముకగా నిలుస్తాడని" బంగ‌ర్ జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు. గిల్ షాట్ ఆడే టైమింగ్ అద్బుతంగా ఉంది. భార‌త జ‌ట్టులో విరాట్‌ కోహ్లి, రోహిత్‌ మర్రిచెట్టు లాంటి వాళ్లు. సాధ‌ర‌ణంగా మర్రి చెట్టు కింద ఎటువంటి మెక్క‌లు పెర‌గ‌వు. కానీ గిల్ మాత్రం.. రోహిత్‌, విరాట్ వంటి మర్రిచెట్టు నీడల్లోంచి గొప్ప క్రికెట‌ర్‌గా ఎదుగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో గిల్ కొట్టిన రెండు స్ట్రెయిట్ డ్రైవ్‌లు, క‌వ‌ర్ డ్రైవ్ షాట్ల‌ను చూడ‌టానికి రెండు క‌ళ్లు స‌రిపోలేదు. ఆ షాట్లు చూసి ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టు ఆట‌గాళ్లు సైతం షాక్ అయిపోయారు" అని సిద్దూ చెప్పుకొచ్చాడు.చదవండి: చాలా అలసిపోయాను.. అది నా బలహీనత.. కానీ అదే బలం: కోహ్లి

Mahabubabad News: Dornakal Mother Usha Case Details7
అమ్మా.. నేనేం పాపం చేశా!

మహాబూబాబాద్‌, సాక్షి: కన్నతల్లే ఆ పిల్లల పాలిట మృత్యు దేవతగా మారింది. తన భర్త మరణించాక మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. అయితే తన సుఖానికి పిల్లలే అడ్డొస్తున్నారని భావించి వాళ్లను లేకుండా చేయాలనుకుంది. ఈ ప్రయత్నంలో ఆ చిట్టితల్లిని విషమిచ్చి ఆ కన్నతల్లి చేజేతులారా చంపేసుకుంది. డోర్నకల్ మండలంలోని జోగ్య తండ గ్రామ పంచాయతీ పరిధిలోని మంగళ్ తండాకు చెందిన వాంకుడోత్ వెంకటేష్‌(30) నాలుగు నెలల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో ఆయన భార్య ఉష, ఇద్దరు పిల్లలు నిత్యశ్రీ (05) అబ్బాయి వరుణ్ తేజ (07)ల అత్తింట్లోనే ఉంటోంది. ఈ నెల 5వ తేదీన ఇంటి వద్ద ఆడుకుంటూ పిల్లలిద్దరూ కిందపడి పోయారు. వాంతులు, విరోచనాలు కావడంతో కంగారు పడిపోయిన వెంకటేష్‌ తల్లి.. పిల్లలను ఏం జరిగిందని వాకబు చేసింది. అమ్మ కూల్‌డ్రింక్‌ తాగించిందని అమాయకంగా చెప్పారు ఆ ఇద్దరూ. ఆ తర్వాత బాబాయ్‌ రాంబాబు సహాయంతో పిల్లలను ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల చికిత్స అనంతరం పిల్లల శరీరంలో గడ్డిమందు అవశేషాలు ఉన్నాయని వైద్యులు తెలపడంతో బంధువులు ఉషను నిలదీశారు. పిల్లలకు కూల్‌డ్రింక్‌లో గడ్డిమందు కలిపి తాగించినట్లు ఒప్పుకుందామె. ఈలోపు పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. పిల్లలకు ఏమైనా జరిగితే తనను చంపేస్తారన్న భయంతో.. ఉష ఎలుకల మందు తాగింది. దీంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పిల్లల బాబాయ్‌ ఫిర్యాదు చేయడంతో.. డోర్నకల్‌ పోలీసులు ఈ నెల 10న హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సుమారు రెండువారాల తర్వాత వరుణ్‌తేజ్‌ కోలుకోగా.. పరిస్థితి విషమించి నిత్యశ్రీ ఆదివారం మృతి చెందింది. దీంతో కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక ఆమెను అరెస్ట్‌ చేస్తామని ప్రకటించారు. ఆ అధికారితో ఉష సంబంధం!నిత్యశ్రీ పోస్టుమార్టంను పర్యవేక్షించిన డోర్నకల్‌ సీఐ బీ రాజేశ్‌.. దగ్గరుండి ఆ చిన్నారి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులకు అప్పగించే క్రమంలో జోగ్యతండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉషను తీసుకు రావాలంటూ ఆగ్రహంతో స్థానికులు ఊగిపోయారు. ఆంబులెన్స్‌కు అడ్డుపడి ధర్నా చేపట్టారు. స్థానికంగా ఉన్న ఓ పోలీస్‌ అధికారితో ఉష సంబంధం ఉందని, ఆ అధికారి చెప్పడంతోనే ఆమె ఈ ఘోరానికి పాల్పడిందని ఆరోపించారు. చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అలా.. 12 గంటలు ధర్నా కొనసాగించారు. ఈ తరుణంలో గ్రామ పెద్దలతో పోలీసులు చర్చలు జరిపారు. నిత్యశ్రీ మృతికి కారణమైన పోలీస్ అధికారిపై విచారణ జరిపించి.. ఈ విషయంలో అయన పాత్ర ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ధర్నా విరమించగా.. నిత్యశ్రీ మృతదేహాన్ని బంధవులకు అప్పగించారు.

Few Members Died With Power Shock8
గుంటూరు పెదకాకానిలో తీవ్ర విషాదం

గుంటూరు: జిల్లాలోని పెదకాకానిలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుత్‌ షాక్‌తో నలుగురు దుర్మరణ చెందారు. గోశాల వద్ద సంపులో పూడిక తీస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుది. ఒక రైతుతో పాటు ముగ్గురు కూలీలు మృతి చెందారు. సంపులో పూడిక తీసివేతకు రైతు.. కూలీలను మాట్లాడుకుని ఆ పని చేస్తుండగా ఈ విషాదం జరిగినట్లు తెలుస్తోంది.

Aap Claims Br Ambedkar Photo Removed From Delhi Chief Minister Office9
వివాదంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా?

ఢిల్లీ : సీఎం రేఖా గుప్తా (Delhi cm Rekha Gupta) వివాదంలో చిక్కుకున్నారా? అంటే అవుననే అంటున్నారు ప్రతిపక్ష ఆమ్‌ ఆద్మీ పార్టీ (aam aadmi party)నేతలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను సీఎం రేఖా గుప్తా అవమానించారని ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏం జరిగింది?ఢిల్లీ సీఎం కార్యాలయంలో బీజేపీ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులైన అంబేద్కర్‌, భగత్‌ సింగ్‌ ఫొటోల్ని తొలగించిందని, ఆ ఫొటోల స్థానంలో మహాత్మా గాంధీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ ఫొటోలను ఉంచినట్లు ఆప్‌ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.ఆప్‌నేత, ఢిల్లీ మాజీ సీఎం అతిషీ మర్లేనా ఎక్స్‌ వేదికగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫొటోల్ని పోస్ట్‌ చేశారు. ఆ సోషల్‌ మీడియా పోస్ట్‌లో తాను సీఎంగా ఉన్న సమయంలో అంబేద్కర్‌, భగత్‌ సింగ్‌ ఫొటోలు ఉన్నాయని, నూతన సీఎంగా బాధత్యలు చేపట్టిన రేఖాగుప్తా ఆ ఫొటోల్ని తొలగించి వాటి స్థానంలో రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలు పెట్టారని పేర్కొన్నారు.बीजेपी को दलितों और सिखों से है गहरी नफ़रत‼️सरकार में आते ही बाबा साहेब और भगत सिंह जी की तस्वीर हटवाई। pic.twitter.com/9loyTc7R1w— AAP (@AamAadmiParty) February 24, 2025 ఇదే అంశంపై అతిషీ మర్లేనా మీడియాతో మాట్లాడారు. బీజేపీ దళిత వ్యతిరేకి. తాజాగా,ఘటనతో ఆధారాలతో సహా భయట పడింది. తమ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో భగత్‌ సింగ్‌,అంబేద్కర్‌ ఫొటోలు పెట్టేలా ఆదేశాలు జారీ చేశారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ యాంటీ దళిత్‌ ఎజెండాతో ముందుకు సాగుతుంది. అంబేద్కర్‌,భగత్‌ సింగ్‌ ఫొటోల్ని తొలగించిందని విమర్శలు గుప్పించారు.ఆప్‌కు భయం పట్టుకుందిఆ ఆరోపణల్ని సీఎం రేఖాగుప్తా స్పందించారు. తన కార్యాలయంలో అంబేద్కర్‌, భగత్‌ సింగ్‌ ఫొటోలు ఉన్నాయంటూ ఆప్‌ చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో నాడు పెండింగ్‌లో ఉన్న 14 కాగ్‌ నివేదికలను సభలో ప్రవేశపెడతామని ఆదివారం సీఎం రేఖాగుప్తా ప్రకటించారు. ఆ ప్రకటనకు ఆప్‌ భయపడిందని, ప్రజల్ని మభ్య పెట్టేలా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందని మండిపడ్డారు. మీరెన్ని డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేసినా.. కాగ్‌ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగి తీరుతుందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రభుత్వ అధిపతి ఫొటో పెట్టకూడదా? దేశ రాష్ట్రపతి ఫొటో పెట్టకూడదా? జాతిపిత గాంధీజీ ఫొటో పెట్టకూడదా? భగత్ సింగ్, అంబేద్కర్‌ మన మార్గదర్శకులు. అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రిగా, ప్రభుత్వ అధిపతిగా, మేం వారి ఫొటోలు పెట్టేందుకు స్థలం కేటాయించాం. ఆప్‌ నేతలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పడం నా పని కాదు.నేను ప్రజలకు జవాబుదారీగా ఉంటానని స్పష్టం చేశారు.

Mohammad Rizwan lauds Kohlis fitness, hard work after Champions Trophy defeat10
అతడు ఫామ్‌లో లేడన్నారు.. కానీ మాకు చుక్క‌లు చూపించాడు: పాక్‌ కెప్టెన్

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్తాన్ క‌థ దాదాపు ముగిసిన‌ట్లే. ఈ మెగా టోర్నీలో పాక్ వ‌రుస‌గా రెండో ఓట‌మి చవిచూసింది. దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాక్ ఓటమి పాలైంది. దీంతో తమ సెమీస్ అవకాశాలను పాక్ సంక్లిష్టం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ పాక్ విఫలమైంది. తొలుత బ్యాటింగ్‌లో 241 పరుగులకు కుప్పకూలిన పాక్‌.. అనంతరం బౌలింగ్‌లోనూ తేలిపోయింది. 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో మెరిశాడు.పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టగా.. అర్బర్ ఆహ్మద్‌, కుష్దిల్ షా తలా వికెట్ సాధించారు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. బ్యాటింగ్‌లోనూ సౌద్ షకీల్‌, రిజ్వాన్‌, కుష్దీల్ షా మినహా మిగితా బ్యాటర్లంతా చేతులెత్తేశారు.ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో సెంచ‌రీతో మెరిసిన‌ విరాట్ కోహ్లిపై రిజ్వాన్ ప్రశంస‌ల వ‌ర్షం కురిపించాడు. విరాట్ కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడి త‌మ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడ‌ని రిజ్వాన్ చెప్పుకొచ్చాడు."తొలుత విరాట్ కోహ్లి గురుంచి మాట్లాడాలి అనుకుంటున్నాను. అత‌డి హార్డ్ వ‌ర్క్ చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. అత‌డు చాలా క‌ష్ట‌ప‌డి ఈ స్దాయికి చేరుకున్నాడు. అత‌డు ఫామ్‌లో లేడ‌ని క్రికెట్ ప్ర‌పంచం మొత్తం అనుకుంటుంది. కానీ ఇటువంటి పెద్ద‌ మ్యాచ్‌ల‌లో మాత్రం విరాట్ ఆటోమేటిక్‌గా ఫామ్‌లోకి వ‌చ్చేస్తాడు.అతడు ఈ మ్యాచ్‌లో ఎక్క‌డ కూడా ఇబ్బంది ప‌డేట్లు క‌న్పించ‌లేదు. చాలా సులువ‌గా షాట్లు ఆడాడు. అత‌డు మేమి ప‌రుగులు ఇవ్వ‌కుండా క‌ట్టడిచేయాల‌న‌కున్నాము. కానీ అత‌డు ఈజీగా ప‌రుగులు సాధించాడు. అత‌డి ఫిట్‌నెస్ లెవ‌ల్స్‌తో పాటు హార్డ్ వ‌ర్క్‌ను ప్ర‌శంసించాల్సిందే.అత‌డు మా లాంటి క్రికెట‌రే. కానీ మా కంటే ఎంతో ఫిట్‌గా ఉన్నాడు. వికెట్ల మ‌ధ్య ఎంతో వేగంగా ప‌రుగులు తీస్తున్నాడు. అతడిని ఔట్ చేయడానికి చాలా ప్రయత్నించాం. కానీ అత‌డు త‌న అద్బుత‌మైన ఆట తీరుతో మ్యాచ్‌ను మా నుంచి తీసుకుపోయాడు. ఇక మ్యాచ్‌లో మేము అన్ని విభాగాల్లో మేము నిరాశపరిచాం.అందుకే ఓడిపోయాము. అర్బర్ ఆహ్మద్ మాత్రం అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఒక్కటి మినహా ఇంకా ఏమీ మాకు సానుకూళ అంశాలు లేవు. మా తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరముంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రిజ్వాన్ పేర్కొన్నాడు.చదవండి: ‘కావాలనే అలా చేశాడు.. లూజర్‌’.. ఆ కోరల నుంచి తప్పించుకుని ఇలా!

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
యుద్ధభూమిలో ఉక్రెయిన్.. మూడేళ్ళలో జరిగిన నష్టాలు

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రారంభమై.. మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ రోజుకి (సోమవారం) నాలుగో ఏడాదిలోకి అడుగుపెడుతోంది.

title
ఛాంపియన్స్‌ ట్రోఫి మ్యాచ్‌లు..పాక్‌ ఇంటెలిజెన్స్‌ వార్నింగ్‌

ఇస్లామాబాద్‌: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 మ్యాచ్‌లకు సంబంధ

title
13 ఏళ్లు రాజకీయాలకు దూరం.. రీఎంట్రీలో అదిరే విజయం

ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో పార్టీ ఓడింది.

title
Ukraine War ఈ యుద్ధంలో అంతిమ విజయం అమెరికాదే?

గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో అమెరికా ఆధ్యక్షుడు ట్రంప్‌ 90 నిమిషాలపాటు పుత

title
ట్రంప్‌ సంచలనం.. రెండు వేల మంది ఉద్యోగులు అవుట్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దూకుడు పెం

NRI View all
title
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాశ్‌ పటేల్‌ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ (Donald Trump) తన  మద్దతు ద

title
మాట నూతన కార్యవర్గం ఏర్పాటు

మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌-మాట బోర్డు మీటింగ్‌ డల్లాస్ లో ఘనంగా జరిగింది.

title
న్యూయార్క్ వేదికగా ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఆల్బమ్ సాంగ్స్

ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ నటించిన తెలుగు , హిందీ ఆల్బమ్ పాటలు  న్యూయార్క్ వేదికగా రిలీజ్ కానున్నాయి.

title
సులభతర వీసా విధానం అవసరం

న్యూఢిల్లీ: వైద్య చికిత్సల కోసం భారత్‌కు వచ్చే విదేశీ రోగులకు సులభతర వీసా విధానాన్ని ప్రవేశపెట్టాలని అపోలో హాస్పిటల్స్‌

title
గుంటూరులో కుట్టుమిషన్లను పంపిణి చేసిన నాట్స్

Advertisement

వీడియోలు

Advertisement