యువతిని ప్రేమించి.. కులాంతార వివాహం చేసుకున్న ఓ యువకుడు కట్నం తీసుకురావాలని ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. తల్లిదండ్రులు, బంధువుల మాటలు విని వేధించసాగాడు. కట్నం తీసుకురాకపోవడంతో ఆస్పత్రికి వెళ్తున్నానంటూ చెప్పి ఇంట్లోంచి పరారయ్యాడు. దీంతో యువతి తన అత్తగారింటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ సంఘటన మండల పరిధిలోని ఘట్టుపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గొసుల శ్రీకాంత్‌రెడ్డి అదే గ్రామానికి చెందిన బైకని శిరీషయాదవ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈక్రమంలో గత సంవత్సరం ఏప్రిల్ 27న ఇంట్లో నుంచి వెళ్లిపోయి విజయవాడ కనకదుర్గా ఆలయంలో వివాహం చేసుకున్నారు.