అసోంలోని టియోక్ టీ ఎస్టేట్‌లో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో సోమ్రా మాఝి (33) అనే మహిళా కార్మికురాలు మృతి చెందింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు సదరు మహిళ మృతికి డాక్టరే కారణమంటూ ఆగ్రహావేశాలకు లోనయ్యారు. డాక్టర్ దేవెన్ దత్తా (73) ఆస్పత్రికి చేరుకోగానే దాదాపు 250 మంది మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు.