రాష్ట్రంలో ఆధార్ నమోదు మరింత సులభతరం కానుంది. ఇకపై ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలన్నీ ఆధార్ నమోదు సెంటర్లుగా మారనున్నాయి. ప్రస్తుతం మీసేవ కేంద్రాల ద్వారా ఆధార్ నమోదు చేస్తున్నప్పటికీ... గ్రామ స్థాయిలో ఈ కేంద్రాలు లేకపోవడంతో పల్లె ప్రజలంతా మండల కేంద్రాలు, సమీప టౌన్‌లకు వెళ్లి ఆధార్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తోంది.