పత్రిక విలువలను పచ్చ మీడియా మంటగలుపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు మండిపడ్డారు. రహస్య పొత్తులు పెట్టుకునే అవసరం తమ పార్టీకి లేదని ఆయన స్పష్టం చేశారు. తమది రాచబాటని, చెప్పిన మాట మీద నిలబడతామని అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి రావాలని కొన్ని పత్రికలు, మీడియా చానల్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. వైఎస్సార్ సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలో చేర్చుకుంటే ఎల్లో మీడియాలో ఆ వార్తలు కనబడవని తెలిపారు. ఓ పత్రికలో పొత్తు పొడిచింది పేరిట అసత్య కథనాలు ప్రచురించారని మండిపడ్డారు.