జమిలీ ఎన్నికలను సిద్ధమన్న తెలంగాణ ముఖ్యమంతి కే. చంద్రశేఖర్ రావు ఇప్పుడు యూ టర్న్ ఎందుకు తీసుకున్నారు..? ముందస్తు ఎన్నికల పేరుతో కేసీఆర్ ప్రజలపై కోట్ల రూపాయల భారాన్ని మోపుతున్నారంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మండిపడ్డారు. శనివారం మహబూబ్‌నగర్ పాలమూరులో నిర్వహించిన బీజేపీ శంఖారావ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘ఇంతకాలం జమిలీ ఎన్నికలను సమర్ధించిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు యూ టర్న్ తీసకున్నారో ప్రజలకు వివరించాలి. లోక్ సభతో కలిసి పోటీ చేస్తే ఓడిపోతామని భయపడ్డారు.