పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్‌సభలో సోమవారం వాడివేడి చర్చ జరిగింది. చర్చ అనంతరం పౌరసత్వ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు ఓటింగ్ నిర్వహించారు. సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 293 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 82 ఓట్లు వచ్చాయి. ఓటింగ్ అనంతరం లోక్‌సభలో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది.