దొంగతనానికి వచ్చిన వారు ఎంత కఠినంగా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డబ్బుల కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకడారు. ఇప్పటి వరకు ఎక్కువగా ఇలాంటి దొంగతనాల గురించే విని ఉన్నాం. కానీ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తే.. మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. దొంగతనానికి వచ్చిన వ్యక్తి.. ఓ ముసలావిడ వద్ద నుంచి డబ్బు తీసుకోకుండా.. ఆమెను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా.. ముద్దుపెట్టుకుని పంపిన ప్రస్తుతం తెగ వైరలవుతోంది.