రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయని, అన్ని స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ‍్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.