ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒక్కసారి ఉలిక్కిపడింది. ఈ పేలుడు ధాటికి ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మృతుడి శరీరభాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. గాయపడిన క్షత్రగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.