తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రం వద్ద ఎక్కువసేపు ఉండటమే ఆయన చేసిన తప్పని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కోడెల చేసిన తప్పును వదిలేసి తమ నేతలపైన కేసులు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ రోజు జరిగిన టీడీపీ దాడులపై వైఎస్సార్ సీపీ నేతలు ఆదివారం గుంటూరు ఎస్సీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ శ్రేణులపై టీడీపీ నేతలు దాడులకు దిగారన్నారు.