ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించానని చంద్రబాబు దొంగ ప్రచారాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాల్లొన్నది యూఎన్‌వోలో కాదనీ, ఎస్‌ఐఎఫ్‌ఎఫ్ అనే స్వచ్ఛంద సంస్థ మీటింగ్‌లో అని తెలిపారు.