తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ఎందుకు కాపీ కొడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయిని దిగజార్చేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏం జరిగినా చంద్రబాబు వల్లే అంటున్నారు.. మరి మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు టీడీపీ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.