ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ చేస్తున్న అవినీతి వల్లే రాష్ట్రానికి ఏ పరిశ్రమలు రావడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, దేశంలోనే అవినీతిలో ఏపీ మొదటి స్థానంలో ఉందని ఆన్‌లైన్ సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు.