ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావడం రాష్ట్ర ప్రభుత్వంలో కలకలం రేపుతోంది. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు ప్రజల్లోకి బలంగా వెళ్ళడంతో.. ప్రభుత్వం మరో డ్రామాకు తెరలేపింది. నాలుగేళ్లపాటు పెన్షన్ల అంశాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ప్రభావంతో పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేసేందుకు సిద్ధమయ్యారు.