భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంలో భారీ లూటీకి రంగం సిద్ధమైంది. కోట్లాది రూపాయలు కమీషన్లు కొట్టేయడానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వ్యూహాలు సిద్ధం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో భారీ దోపిడీకి అనుకూలంగా అస్మదీయులకు పనులు కట్టబెట్టడానికి నిబంధనలు రూపొందిస్తున్న విధానంలోనే ఈ ఎయిర్‌పోర్ట్ పనులను కూడా అప్పగించేందుకు రెడీ అయ్యారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఎప్పటి నుంచో ఆసక్తి చూపిస్తోంది.