ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ప్యాక్ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీని అన్ని జిల్లాల్లో అమలు చేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పౌరసరఫరాల శాఖతో శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, సీనియర్ అధికారులు హజరయ్యారు.