రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన టీజేఏసీ చైర్మన్ కోదండరాంను అసలు తయారుచేసిందే నేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాజకీయ జీవితంలో వేలు, లక్షల మంది కార్యకర్తలను తయారుచేశానని, అందులో ఒకడు కోదండరామని గుర్తుచేశారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎం మీడియాతో మాట్లాడారు. ‘కోదండరాం కనీసం సర్పంచ్‌గానైనా గెలిసిండా? ఆయన జేఏసీనా? ఆయన చేసింది అమరవీరుల ఆత్మగౌరవ యాత్రనా? లేక లంగల రాజకీయ యాత్రనా? కోదండరాం ముమ్మాటికీ టీఆర్‌ఎస్ వ్యతిరేకి. దొంగతనంగా వెళ్లి ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులను కలిశాడు. ఆయన్ని మాటలువిని కాంగ్రెస్ నాశనమైంది. నేను తయారుచేసిన లక్షల మంది కార్యకర్తల్లో కోదండరాం ఒకడు. నీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే శ్రీకాంతచారి తల్లికి మద్దతు ఎందుకు ఇయ్యలేదు? ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఇస్తనని ఎప్పుడో చెప్పిన. ఇలాంటి వ్యక్తులను ప్రజలు విశ్వసించొద్దు’ అని కేసీఆర్ అన్నారు. తమ ప్రభుత్వం మైనారిటీలు, జర్నలిస్టులు, న్యాయవాదులు సహా మేం ఎవ్వరినీ నిర్లక్ష్యం చేయబోదని, దశలవారీగా నిరుద్యోగులకు న్యాయం చేస్తాం. తెలంగాణ ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు.