రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి కరీంనగర్‌కు విచ్చేశారు. గత సంవత్సరం డిసెంబర్ 30న వేములవాడ రాజన్నను దర్శించుకొని మిడ్‌మానేరు రిజర్వాయర్‌కు పూజలు చేసి ఇక్కడికి వచ్చిన కేసీఆర్ 40 రోజుల తరువాత బుధవారం రాత్రి మరోసారి తనకిష్టమైన కరీంనగర్‌కు వచ్చారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దేవాలయంలో పూజలు, కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధానమైన లక్ష్మీ బ్యారేజీలను సీఎం సందర్శించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి బుధవారం రాత్రి రోడ్డు మార్గంలో బయలుదేరి కరీంనగర్ వచ్చిన ముఖ్యమంత్రి తీగలగుట్టపలి్లలోని నివాసానికి చేరుకున్నారు. రాత్రి ఇక్కడే బస చేసిన సీఎం గురువారం ఉదయం కాళేశ్వరం బయలుదేరనున్నారు.
లక్ష్మీ బ్యారేజ్‌ను పరీశీలించిన సీఎం కేసీఆర్
Published Thu, Feb 13 2020 3:35 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM
Advertisement
Advertisement
Advertisement