కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్‌ఎస్ గూటికి చేరిన ఎమ్మెల్యేపై అనర్హత వేటువేయ్యాలని టీపీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని ఉత్తమ్ ఆరోపించారు. మండలి ఎన్నికల ముందు ఇద్దరు ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లోని తీసుకోవడాన్ని నిరశిస్తూ అసెంబ్లీ ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నల్లబ్యార్జీలతో నిరసనకు దిగారు.