ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 276వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం విజయనగరం నియోజకవర్గంలోని కొత్తపేట నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి సంకేటి వీధి, కుమ్మరి వీధి, వైఎస్సార్ నగర్, కొండకరకాం వరకు పాదయాత్ర కొనసాగనుంది. అక్కడ వైఎస్‌జగన్ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి నెల్లిమర్ల నియోజకవర్గంలోని కొండవెలగాడ వరకు ప్రజాసంకల్పయాత్ర సాగనుంది.
276వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
Published Tue, Oct 2 2018 9:36 AM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM