సిర్పుర్ కాగజ్‌నగర్‌లో అటవీశాఖ అధికారిణిపై ఆదివారం ఉదయం జరిగిన దాడిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం పోడు భూముల్లో చెట్లను నాటాలని అదేశించి.. ఎమ్మెల్యే అనుచరులతో అధికారులపై దాడి చేయించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. 2008- 2009లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పోడు భూమూలపై గిరిజనులకు పూర్తి అధికారాలు ఇచ్చిందని గుర్తు చేశారు.