sirpur kaghaznagar
-
సిర్పూరు రాజకీయ చరిత్ర.. ఎవరెవరు.. ఎప్పుడు.. ఎలా గెలిచారంటే..?
తెలంగాణలో తొలి నియోజకవర్గం అయిన సిర్పూర్ కాగజ్‌నగర్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధి కోనేరు కోనప్ప 2018లో మరోసారి విజయం సాదించారు. ఆయన గత ఎన్నికలలో బహుజన సమాజవాది పార్టీ తరపున పోటీచేసి గెలుపొంది, తదుపరి టిఆర్ఎస్లో చేరిపోయారు. 2018లో టిఆర్ఎస్ టిక్కెట్ పై పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబుపై 24144 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. సిర్పూర్లో బిజెపి అభ్యర్ధి శ్రీనివాసులు 5813 మూడోస్థానంలో ఉన్నారు. 2004లో కాంగ్రెస్ ఐ పక్షాన కూడా కోనప్ప గెలిచారు. ఈయన కమ్మ సమాజిక వర్గానికి చెందినవారు. కాగా ఓటమి చెందిన హరీష్‌బాబు తల్లిదండ్రులు పురు షోత్తంరావు, రాజ్యలక్ష్మీ ఇద్దరూ గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కోనప్ప మూడుసార్లు గెలవగా, గతంలో ఇదే సామాజిక వర్గానికి చెందిన కెవి నారాయణ రావు రెండుసార్లు గెలిచారు. దాంతో ఐదుసార్లు కమ్మ నేతలు గెలిచినట్లయింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో తెలంగాణ అంతటా 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనం బలంగా వీచి ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆదిలాబాద్ జిల్లాలోని తొలి నియోజకవర్గం అయిన సిర్పూరు నియోజకవర్గంలో ఆ పార్టీ ఓడిపోవడం ఒక సంచలనం అయితే బిఎస్పి పార్టీ గుర్తుపై కోనేరు కోనప్ప 8837 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించడం మరో సంచలనంగా చెప్పాలి. 2014లో సిర్పూరులో కోనప్పకు 31359 ఓట్లు రాగా, టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన కావేటి సమ్మయ్యకు40196 ఓట్లు రాగా, కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన ఎమ్మెల్సీ కె.ప్రేమ్‌సాగర్ రావుకు 26956 ఓట్లు, టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ధి రావి శ్రీనివాసరావుకు 19359 ఓట్లు వచ్చాయి. కోనప్ప రెండువేల నాలుగులో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలుపొందారు. 2009లో ఓటమి చెందారు. తదుపరి జరిగిన వివిధ పరిణామాలలో ఆయన మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఐలో తిరిగి చేరినా, టిక్కెట్ రాని నేపధ్యంలో బిఎస్పి టిక్కెట్ పై పోటీచేసి గెలుపొందడం విశేషం. ఈ నియోజకవర్గంలో ఇంతవరకు ఈయనతో సహా ఐదుసార్లు కమ్మ నేతలు గెలుపొందగా, వెలమ నేతలు మూడుసార్లు గెలిచారు. బీసీ నేతలు నాలుగుసార్లు, రెడ్డి నేతలు రెండుసార్లు, దళిత నేతలు మూడుసార్లు విజయం సాధించారు. రెండువేల తొమ్మిదిలో గెలుపొందిన సమ్మయ్య తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఒకసారి రాజీనామా చేశారు. తదుపరి జరిగిన ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా కావేటి సమ్మయ్య తిరిగి పదిహేనువేలకుపైగా మెజారిటీతో రెండోసారి గెలిచారు. ఆ ఉప ఎన్నికలో ఇక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ ఐ సీనియర్ నేత మాజీ ఎం.పి ఇంద్రకరణ్‌రెడ్డి, టిడిపి మాజీ ఎమ్మెల్యే పి.రాజ్యలక్ష్మి ఓడిపోయారు. తదుపరి ఇంద్రకరణ్ రెడ్డి కూడా టిఆర్ఎస్లో చేరిపోయారు. 1952 నుంచి సిర్పూరు నియోజకవర్గం ఉంది. తొలి రోజుల్లో ఈ ప్రాంతంలో సోషలిస్టు ప్రభావం అధికంగా ఉండేది. 1952, 57లలో సోషలిస్టు అభ్యర్దులు గెలుపొందారు. 1957లో ఈ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గం ఉండేది. అంటే అప్పట్లో ఒకే నియోజకవర్గం నుంచి ఒక జనరల్ అభ్యర్ధిని, ఒక రిజర్వుడు కేటగిరి అభ్యర్దిని ఎన్ను కోవాలన్నమాట. విశేషం ఏమిటంటే ఈ నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్దులు ఎస్.సి అభ్యర్థులే గెలుపొందారు. వీరిద్దరూ ఆ తరువాత కాలంలో ప్రముఖ నేతలుగా ప్రసిద్ధిగాంచారు. కోదాటి రాజమల్లు ప్రజాసోషలిస్టు పార్టీ అభ్యర్దిగా గెలుపొందితే, మరొకరు జి. వెంకటస్వామి కాంగ్రెస్ పక్షాన గెలిచారు. ప్రముఖ కార్మిక నేత జి. సంజీవరెడ్డి రెండుసార్లు, ఇంకో ప్రముఖ స్వాతంత్య్రయోధుడు కె.వి.కేశవులు రెండుసార్లు గెలుపొందగా, టిడిపి ఆవిర్భావం తరువాత కె.వి.నారాయణరావు రెండుసార్లు, పాల్వాయి పురుషోత్తంరావు రెండుసార్లు ఇండిపెండెంటుగా గెలుపొందగా, పురుషోత్తంరావు భార్య పి. రాజ్యలక్ష్మి ఒకసారి టిడిపి తరపున గెలిచారు. తొలిసారి 1983లో టిడిపి అక్కడ గెలిచింది. అప్పటి నుంచి 2004లో కోనప్ప కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచేవరకు అక్కడ కాంగ్రెస్ ఐకి అవకాశం రాలేదు. మళ్ళీ 2009లో టిఆర్ఎస్ గెలవడం విశేషం. అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఆరుసార్లు, సోషలిస్టు ఒకసారి, ప్రజాసోషలిస్టు పార్టీ ఒకసారి, టిఆర్ఎస్ మూడుసార్లు గెలవగా, టిడిపి మూడుసార్లు గెలిచింది. ఇండిపెండెంట్ రెండుసార్లు గెలిచారు. కోదాటి రాజమల్లు ఇక్కడ ఒకసారి, లక్సెట్టిపేటలో సోషలిస్టుగా ఒకసారి, చిన్నూరు నుంచి కాంగ్రెస్ తరుఫున మూడుసార్లు మొత్తం ఐదుసార్లు చట్టసభకు ఎన్నికయ్యారు. ఒకసారి అసెంబ్లీకి ఎన్నికైన వెంకటస్వామి ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. రాజమల్లు, కె.వి.కేశవులు గతంలో జలగం వెంగళరావు క్యాబినెట్లో మంత్రి పదవులు నిర్వహించారు. కాసు బ్రహ్మానందరెడ్డి క్యాబినెట్లో జి.సంజీవరెడ్డి మంత్రిగా ఉన్నారు. వెంకటస్వామి రాష్ట్రంలోను, కేంద్రంలోను మంత్రిగా పనిచేశారు. వెంకటస్వామి ఎమ్మెల్సీగా కూడా కొంతకాలం ఉన్నారు. ఇండిపెండెంట్‌గా రెండుసార్లు గెలిచిన పాల్వాయి పురుషోత్తంరావు 1999 నాటికి టిడిపిలో చేరిపోయారు. అయితే ఎన్నికలు జరగడానికి ముందే పురుషోత్తంరావును నక్సలైట్లు హత్య చేయడంతో ఆయన భార్యకు టీడీపీ టికెట్ ఇచ్చింది. ఒకసారి గెలిచిన ఆమె ఆ తరువాత 2004లో పోటీచేసి ఓడిపోయారు. సిర్పూరులో ఎవరెవరు.. ఎప్పుడు.. ఎలా గెలిచారంటే.. -
నా భార్యకు ప్రాణభిక్ష పెట్టండి
కాగజ్‌నగర్ : రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాన్ని అరుదైన వ్యాధి చిన్నభిన్నం చేస్తోంది. శస్త్రచికిత్స చేయించుకోవడానికి మూడేళ్లుగా ప్రయత్నం చేస్తున్నా సఫలం కావట్లేదు. వారు చెప్పిన.. వీరు చెప్పిన ఆస్పత్రులన్నీ తిరిగితే చేతిలో ఉన్నకాడికి ఖర్చయిందని.. ఖర్చులకు ఇప్పటి వరకు ఆస్తిపాస్తులమ్మి రూ.20 లక్షల వరకు ఖర్చు చేసినట్లు బాధిత కుటుంబం వాపోయింది. వాంకిడి మండలానికి చెందిన నరేందర్ రామలక్ష్మి తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత బతుకుదెరువు కోసం ఆరేళ్ల క్రితం బెజ్జూర్ మండలానికి చేరుకొని జీవనం సాగిస్తున్నారు. భర్త నరేందర్ మోటర్ వైండింగ్ మెకానిక్‌గా, రామలక్ష్మి ఇందిరాక్రాంతి పథకంలో అకౌంటెంట్ విధులు నిర్వర్తిస్తూ వస్తున్న కొద్దిపాటి మొత్తంతో అన్యోన్యంగా జీవించేవారు. ఎవరి కళ్లు పడ్డాయో కానీ మూడేళ్ల క్రితం రామలక్షికి కంటి సమస్యతో మొదలైన ఆరోగ్య సమస్య కొత్తరకం వ్యాధికి దారితీసింది. ఎన్నో ఆస్పత్రులు తిరిగినా కానీ నయం కాకపోవడంతో చివరకు హైదరాబాద్ వైద్యులు తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి గుండెకు సంబంధించిన వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. రెండేళ్ల క్రితం చికిత్స నిమిత్తం రూ.18 లక్షలు ఖర్చవుతుందని తెలపడంతో పేద కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. అప్పటి నుంచి తన భార్యకు శస్త్రచికిత్స చేయించి కాపాడుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నా సఫలం కావడం లేదని నరేందర్ కన్నీటి పర్యంతమయ్యాడు. నా భార్యకు ప్రాణభిక్ష పెట్టండి నా భార్య రామలక్ష్మికి ప్రాణభిక్ష పెట్టమని నరేందర్ వేడుకుంటున్నాడు. నరేందర్ మాట్లాడుతూ... మూడేళ్లుగా నా భార్య రామలక్ష్మి ఆరోగ్య సమస్యతో బాధపడుతుందని, తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలోని ఆస్పత్రులకు కూడా తీసుకెళ్లానని పేర్కొన్నాడు. రెండేళ్ల క్రితం తమిళనాడు రాష్ట్రంలోని సీఎంసీ ఆస్పత్రి వర్గాలు వ్యాధి గుర్తించి రూ.18 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. అంత స్థోమత లేకపోవడంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. చిన్ననాటి మిత్రులు చందాల రూపంలో రూ.3 లక్షలు పోగు చేసి అందించారని, విషయం తెలుసుకున్న అప్పటి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే, లక్ష్మి స్పందించి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం చేశారని పేర్కొన్నాడు. రెండేళ్ల క్రితం మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకెళ్లి ఆరోగ్య సమస్యను వివరించిగా.. వైద్య చికిత్స అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపాడు. కానీ ముందస్తుగా ల క్షల రూపాయలు పెట్టి వైద్యం చేయించే ఆర్థిక ప రిస్థితి లేక అచేతనంగా ఇంట్లోనే ఉన్నట్లు వాపోయాడు. తన భార్య పరిస్థితి రోజురోజుకూ విషమిస్తోందని, నా భార్యకు శస్త్ర చికిత్స చేయించి బ తి కించుకోవాలని ఉందని అన్నాడు. ప్రభుత్వం, స్పందించి వైద్యం అందించి కాపాడాలని వేడుకున్నాడు. -
సిర్పూజ్ కాగజ్‌నగర్ పేపర్‌మిల్లులో ప్రమాదం
-
విధుల్లోనే మృత్యుఒడిలోకి
సాక్షి, కౌటాల(సిర్పూర్): కౌటాల మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో సివిల్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ మనోజ్ కుమార్(27) గురువారం వేకువ జామున గుండెపోటుతో మృతి చెందినట్లు సిర్పూర్(టి) ఎస్సై ఎస్. వెంకటేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మనోజ్ బుధవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో పహార (వాచ్) డ్యూటీలో ఉన్నాడు. రాత్రి 11 గంటల వరకు తోటి పోలీసులతో సంతోషంగా విధులు నిర్వర్తించాడు. విధుల అనంతరం మనోజ్ నిద్రపోయాడు. గురువారం ఉదయం హెడ్‌కానిస్టేబుల్ రమేష్ నిద్రలో ఉన్న మనోజ్‌ను పిలవగా మనోజ్ స్పందించకపోవడంతో అనుమానం వచి్చన అతను కౌటాల సీఐకు సమాచారం అందించారు. దీంతో కౌటాల సీఐ బి. శ్రీనివాస్ మనోజ్‌ను పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే మనోజ్‌ను సిర్పూర్(టి)లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మనోజ్ స్వస్థలం కెరమెరి మండలంలోని దేవపూర్ గ్రామం. మనోజ్‌కు భార్య జీవిత ఉన్నారు. కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకుంటాం సిర్పూర్(టి): కానిస్టేబుల్ మనోజ్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు. సిర్పూర్ సామాజిక ఆసుపత్రిలో కానిస్టేబుల్ మనోజ్ కు టుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని వారికి తెలిపారు. 15 రోజు ల్లో కుటుంబ సభ్యు ల్లో ఒకరికి ఉద్యోగం కలి్పస్తామని తెలిపారు. ఆయనతో ఏఎస్పీ సుదీంధ్ర, డీఎస్పీ స్వామి, సీఐ శ్రీనివాస్, ఎస్సై వెంకటేష్ ఉన్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కెరమెరి(ఆసిఫాబాద్): విధి నిర్వాహణలో గుండెపోటుతో మృతి చెందిన మనోజ్ కుమార్ అంత్యక్రియలను పోలీసులు అధికార లాంఛనాలతో దేవాపూర్‌లో జరిపారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ సురేశ్ కుమార్, ఆర్ఐ ఎం. శ్రీ నివాస్, సీఐ శ్రీనివాస్, ఎస్సైలు రమేశ్, వెంకటేశ్, నాజర్ హుస్సేన్, అమీరోద్దిన్ పాల్గొన్నారు. -
కన్నీరే మిగులుతోంది.!
సాక్షి, చింతలమానెపల్లి(సిర్పూర్) : గమ్యం చేరే వరకూ భరోసా లేని పడవ ప్రయాణాలు విషాద రాత రాస్తున్నాయి. గత్యంతరం లేక ప్రాణాలను పణంగా పెట్టి చేపడుతున్న పడవల ప్రయాణం ఇంకో మార్గానికి చేర్చుతున్నాయి. పడవ ప్రమాదాలు చోటుచేసుకుని కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతుండగా, మృతుల కుటుంబ సభ్యులకు తీరని వేదనను మిగుల్చుతోంది. పూట గడవడానికి పడవ నడుపుతున్న వారి నిర్లక్ష్యం మూలానికి ప్రయాణికుల ప్రాణాలు నీటిలో కలుస్తున్నాయి. జిల్లాలోని ప్రాణహిత నదీ మీద నిత్యం పడవ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా అధికార యంత్రాంగం గుణపాఠం నేర్వడం లేదు. దీంతో విషాద సంఘటనలు పునరావృతమవుతున్నాయి. జిల్లాలోని సిర్పూర్, కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, దహెగాం మండలాల సరిహద్దుల్లో తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దుగా పెన్‌గంగా, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి. ఇరు ప్రాంతాల మధ్య ఉన్న సంబంధాలు, వ్యాపార, ఇతర అవసరాల రీత్యా నిత్యం ప్రజలు రాకపోకలు సాగి స్తుంటారు. నదులపై వంతెనలు లేకపోవడంతో రేవుల నుంచి నాటు పడవల్లో గట్టు దాటాల్సి వస్తోంది. కౌటాల మండలంలోని వీరవెల్లి, విర్దండి, గుండాయిపేట, తుమ్మిడిహెట్టి, రణవెల్లి, చింతలమానెపల్లి మండలంలోని చిత్తామ, గూడెం, బెజ్జూర్ మండలంలోని తలాయి, సోమిని, దహెగాం మండలంలోని మొట్లగూడెం ఓడరేవుల నుంచి భారీ సంఖ్యలో ప్రయాణికులు వెళ్తుంటారు. చింతలమానెపల్లి మండలం లోని చిత్తామ, గూడెం వద్ద మహారాష్ట్రలోని అహేరి, ఆళ్ళపల్లి, ఏటపల్లి, సిరోంచ, సహా చత్తీస్‌ఘడ్‌లోని పలు ప్రాంతాలకు భారీ రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు మార్గం కంటే పడవల్లో నదిని దాటితే దూరం తక్కువగా ఉండడంతో ప్రయాణికులు అందుకే చూపుతున్నారు. ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం.. నాటు పడవల నిర్వహకులు ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చాల్సి ఉండగా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాటు పడవలను నడిపేవారు సంబంధిత అధికారుల నుంచి లైసెన్సు పొందాల్సి ఉంటుంది. లైసెన్సు, అనుభవం లేని వారు నడుపుతుండడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పడవలను నాసిరకంగా తయారు చేయడంతో ప్రయాణ సమయంలో పడవలోకి నీళ్లు చేరుతున్నాయి. పడవలకు రంధ్రాలు పడ్డప్పుడు వాటికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా నామమాత్రపు మరమ్మతులు నిర్వహించి నడుపుతున్నారు. పడవల్లోకి చేరితో నీటిని బకెట్లతో తోడుతుంటారు. ఈ క్రమంలో నీళ్లు అధికమై పడవలు మునిగిపోతున్నాయి. ఆదివారం బీట్ ఆఫీసర్ల ప్రమాదంలోనూ ఇదే జరిగింది. వంతెనలు లేక ఇబ్బందులు.. మహారాష్ట్ర– తెలంగాణ సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల ప్రజలకు సంబంధాలున్నాయి. ఈనేపథ్యంలో రవాణా మార్గాలుగా ఇరు ప్రాంతాలకు వెళ్లేందుకు నదిలో నాటు పడవలను ఆశ్రయిస్తారు. చింతలమానెపల్లి మండలంలోని గూడెం వద్ద వంతెన నిర్మాణంలో ఉండగా ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తయ్యాయి. కౌటాల మండలంలోని గుండాయిపేట వద్ద పెన్‌గంగా నదిపై వంతెనకు ప్రతిపాదనలు పూర్తయినట్లు అధికారులు తెలుపుతున్నారు. వంతెనల నిర్మాణం పూర్తయితే ప్రజలకు ఇబ్బందులు దూరంకానున్నాయి. వంతెనలు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పడవల్లో ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈక్రమంలో ఏమాత్రం వరద ఎక్కువగా ఉన్నా, నడిపే వారు అజాగ్రత్తగా ఉన్నా జరగరానిది జరిగిపోతుంది. అనుమతులు లేకుండానే.. నదులపై లేదా ఇతర నీటి ప్రవాహ ప్రాంతాల్లో ప్రయాణికులను తరలించేందుకు పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అనుమతులు తప్పనిసరి. దీంతో పాటు ఏటా నిర్ణీత కాలవ్యవధిలో రెన్యూవల్ ఉంటుంది. ఆయా సమయాల్లో పోలీసులు, ఇతర శాఖలు తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది. కాని సరిహద్దులో ఉన్న ప్రాణహిత నదిలో ప్రయాణికులను తరలించేందుకు ఎలాంటి అనుమతులు లేవు. కేవలం చేపలు పెంచడానికి అనుమతులు పొందిన వారే ప్రయాణికులను తరలిస్తున్నారు. ఈ క్రమంలో పరిమితికి మించి చేరవేస్తున్నారు. ఇలా పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తుండడంతో వర్షాకాలంలో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈఏడాదిలో ప్రాణహిత నదిలో నలుగురు మృత్యువాత పడడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఉన్నతాధికారుల వైఫల్యాన్ని తాజా ఘటన ఎత్తి చూపడంతో పాటు గుణపాఠం నేర్చుకోవాలి్సన అవసరాన్ని నొక్కి చెబుతోంది. ఈ ఏడాది జరిగిన ప్రమాదాలు.. 1. ఫిబ్రవరి 16న కాగజ్‌నగర్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ పోరెడ్డి దినకర్‌రెడ్డి, అతని మామ బాపిరెడ్డి నదిలో నీటి ప్రవాహంలో పడి మృతిచెందారు. 2. 23 మే 2016న మంచిర్యాలకు చెందిన వెంకటేశ్, రాజు, మమత కౌటాల మండలం తుమ్మిడిహేటి వద్ద పడవ మునగడంతో మృతిచెందారు. 3. కౌటాల మండలంలోని వీరవెల్లి వద్ద 2011 ఏప్రిల్ 24న పడవ మునగడంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. 4. గతేడాది గూడెం వద్ద నదిని దాటుతున్న ప్రయాణికుల పడవ మధ్యలో ఆగిపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండాల్సి వచ్చి ంది. ప్రయాణికులను తీసుకెళ్లేందుకు వచ్చిన పడవ సైతం చెడిపోవడంతో మరో పడవను ఆశ్రయించారు. ఇలా పడవలు చెడిపోయి ఇబ్బ ందులకు గురైన సంఘటనలు అనేకం ఉన్నా యి. బీట్ ఆఫీసర్ల మరణమే ఆఖరు అయ్యేలా, మరో ప్రమాదం చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. -
మళ్లీ సింగరేణి రైలు కూత
సాక్షి, కొత్తగూడెం అర్బన్: దశాబ్దాల పాటు ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చిన సింగరేణి ప్యాసింజర్ రైలు సర్వీసు తిరిగి ప్రారంభం కాబోతోంది. ఏడు నెలల సుదీర్ఘ పోరాటం అనంతరం ఫలితం లభించింది. 60 ఏళ్ల చరిత్ర ఉన్న రైలును వ్యయం తగ్గించే కార్యాచరణలో భాగంగా రద్దు చేశారు. దాని స్థానంలో పుష్ఫుల్ రైలును ప్రారంభించారు. నూతన రైలులో కొత్తగూడెం నుంచి సిర్పూర్కాగజ్నగర్ వరకు ఉన్న ప్రయాణికులు దాదాపు ఏడు నెలల పాటు అష్టకష్టాలు పడ్డారు. భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) రైల్వే స్టేషన్‌కు వచ్చిన రైల్వే అధికారులకు వినతులు ఇచ్చి, సింగరేణి రైలును పున:ప్రారంభించాలని కోరారు. కొత్తగూడెంలో అన్ని పార్టీల వారు అఖిలపక్షంగా ఏర్పడి దీక్షలు, ఐక్య ఉద్యమాలు చేపట్టారు. అందరి పోరాట ఫలితంగా సింగరేణి ప్యాసింజర్ రైలును పునఃప్రారంభించడానికి రైల్వే అధికారులు ఎట్టకేలకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. సింగరేణి ప్రాంతాలను కలుపుకుంటూ వెళ్లే సింగరేణి ప్యాసింజర్ రైలులో ఎక్కువగా సింగరేణి కార్మిక కుటుంబాలు, ఆయా ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునే రైతుల కుటుంబాలు ప్రయాణం చేస్తుంటాయి. ఈ నెల 6వ తేదీ నుంచి భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్ వరకు పాత సింగరేణి ప్యాసింజర్ ప్రారంభం కానుంది. దసరా కానుకగా అంతా భావిస్తున్నారు. గతంలో మాదిరిగానే 14 కోచ్‌లతో నడువనుంది. ప్రతి కోచ్‌కు బాత్రూంలు, ప్రయాణికుల సామగ్రిని పెట్టుకోవడానికి సదుపాయం ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. 14కోచ్‌లతో రైలు సర్వీసు ఈ నెల 6వ తేది నుంచి భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వరకు సింగరేణి ప్యాసింజర్ రైలు పునఃప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో నడిచిన విధంగానే 14 కోచ్‌లతో నడువనుంది. సమయాల్లో ఏ మార్పులూ ఉండవు. – కిరణ్‌కుమార్, భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చాలా సంతోషంగా ఉంది.. కొత్తగూడెంలోని ప్రజలు, ప్రయాణికులు ఎన్నో పోరాటాలు చేసి సింగరేణి ప్యాసింజర్ రైలును తిరిగి తెప్పించుకోగలిగారు. అన్నీ పార్టీల వారు పోరాడారు. – కలవల చంద్రశేఖర్ పుష్పుల్లో ఒక్క బాత్రూమే.. సింగరేణి ప్యాసింజర్ రైలు స్థానంలో పుష్ఫుల్ రైలు తిప్పగా..బాత్రూంలు లేక మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రైలులో ఉన్న ఒక్క బాత్రూం వద్ద తీవ్ర దుర్వాసన వచ్చేది. –భూక్య హుస్సేన్, తడికలపూడి ఏడు నెలలు ఇటు రాలే.. భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి పుష్ఫుల్ రైలు ప్రారంభం అయినప్పటి నుంచి ఆ రైలులో ప్రయాణించడం బంద్ చేశాం. వారానికి ఒక్క సారి పెద్దపల్లికి బస్సులోనే పోయాం. – రవి, రుద్రంపూర్ -
కోనేరు కృష్ణకు బెయిల్
సాక్షి, ఆదిలాబాద్ : సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ బెయిల్‌పై విడుదలయ్యారు. కుమురంభీమ్ జిల్లాలోని కాగజ్‌నగర్ రేంజ్ పరిధి కాగజ్‌నగర్ మండలం కొత్తసార్సాలలో అటవీశాఖ అధికారులపై దాడి చేసిన కేసులో ఆయన జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అటవీప్రాంతంలో మొక్కలు నాటేందుకు భూమిని చదును చేయడానికి జూన్ 30న వెళ్లిన సిబ్బందితో పాటు ఎఫ్ఆర్వో అనితపై కాగజ్‌నగర్ జెడ్పీ వైస్‌చైర్మన్ కోనేరు కృష్ణతోపాటు ఆయన అనుచరులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అటవీశాఖ ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించారు. కృష్ణతోపాటు మరో 38 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదేరోజు కృష్ణ జెడ్పీ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. కోనేరు కృష్ణతోపాటు దాడికి పాల్పడిన ఆయన అనుచరులను ఆదిలాబాద్ జైలుకు తరలించారు. నాలుగోసారికి బెయిల్ మంజూరు.. అటవీశాఖ అధికారులపై దాడికి పాల్పడిన కేసులో కృష్ణ, ఆయన అనుచరులు బెయిల్ కోసం నాలుగుసార్లు కోర్టును ఆశ్రయించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు రెండుసార్లు బెయిల్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించగా మొదటిసారి కోర్టు తిరస్కరించింది. రెండురోజులు క్రితం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు అయిన 38 మందిలో దశలవారీగా 22 మందికి బెయిల్ మంజూరైంది. మిగిలిన 16 మంది గురువారం ఆదిలాబాద్ జైలునుంచి బయటకు వచ్చారు. బెయిల్‌పై బయటకు వచ్చిన కృష్ణ ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్అండ్బీ విశ్రాంతి భవనానికి చేరుకుని తన సోదరుడు కోనేరు కోనప్ప, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, టీఆర్ఎస్ నాయకులను కలిశారు. సిర్పూర్ కాగజ్‌నగర్‌కు చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పూలమాలలు వేసి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. -
కాగజ్‌నగర్‌లో 144 సెక్షన్
సాక్షి, కాగజ్‌నగర్(ఆదిలాబాద్) : కుమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్‌లో మిల్లు యాజమన్యం, లారీ అసోసియేషన్ మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదం తారాస్థాయికి చేరుకుంది. మిల్లులోని ఉత్పత్తిని వందశాతం తమతోనే లోడింగ్ చేయించాలని లారీ అసోసియేషన్ పట్టుబడడంతో అంత సాధ్యం కాదని 33 శాతం మాత్రమే స్థానిక లారీల ద్వారా సరుకులు ఎగుమతి, దిగుమతి చేస్తామని భీష్మించారు. దీంతో రోజురోజుకు ఇద్దరి మ«ధ్య వివాదం ముదురుతోంది. ఈ నెల 17న లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అదేరోజు లారీ డ్రైవర్ శంకర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇన్చార్జి డీఎస్పీ సత్యనారాయణ రంగంలోకి దిగి సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. విషయాన్ని ఎస్పీ మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఎస్పీ, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఇరువురిని పిలిచి చర్చలు జరిపారు. అయిన చర్చలు సఫలం కాకపోవడంతో లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆదివారం రెండు లారీలు కాగజ్‌నగర్ చేరుకోవడంతో లారీ డ్రైవర్లను లారీ అసోసియేషన్ సభ్యులు సముదాయించారు. అంతలోనే పట్టణ సీఐ కిరణ్ డ్రైవర్లను తమవెంట పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లగా వివాదం ముదిరింది. లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఇదే క్రమంలో అక్కడే రోడ్డుపై ఉన్న లారీకి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ముదురుతున్న వివాదం... ఇరువురి పట్టింపు కారణంగానే కాగజ్‌నగర్‌లో వివాదం ముదురుతోంది. స్థానికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని లారీ అసోసియేషన్ పట్టుబడడంతో, అంతసాధ్యం కాదని పేపర్ మిల్లు యాజమాన్యం ససేమీరా అంటోంది. దీంతో 11 రోజులుగా వివాదం ముదురుతోంది. ఈ వివాదం ఆత్మహత్యాయత్నం వరకు దారితీసింది. అంతే కాకుండా గుర్తు తెలియని వ్యక్తి రోడ్డుపై ఉన్న లారీకి నిప్పంటించడం కూడా జరిగింది. ఇరువురు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటే ఇంత జరిగేది కాదని పలువురి వాదన. తమ పొట్టపై కొట్టొద్దని లారీ అసోసియేషన్ విన్నవించినా యాజమాన్యం పట్టించుకోవడంలేదనే ఆరోపనలున్నాయి. యాజమాన్యం స్థానికులకు ప్రాధాన్యం కల్పిస్తే ఇంత రాద్ధాంతం జరిగేది కాదంటున్నారు. ప్రజాప్రయోజనాల దృశ్యా యాజమాన్యం దిగివచ్చి స్థానికులకు పాధాన్యం కల్పిస్తే స్థానిక లారీ కార్మికులకు ఉపాధి దొరుకుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లారీ అసోసియేషన్ సభ్యుల అరెస్ట్ కాగజ్‌నగర్ పట్టణంలో కొద్ది రోజులుగా లారీ అసోసియేషన్, మిల్లు యాజమాన్యం మధ్య కొనసాగుతున్న వివాదంలో ఏడుగురిపై కేసు నమోదు చేసి ఆసిఫాబాద్ జైలుకు రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ కిరణ్ తెలిపారు. జిల్లాలో 30 యాక్టు అమలులో ఉన్న నేపథ్యంలో శనివారం లారీ అసోసియేషన్ సభ్యులను రెచ్చగొట్టి పబ్లిక్ రోడ్డుపై గందరగోళం చేస్తూ పోలీసుల విధులకు భంగం కలిగించిన వెన్న కిషోర్, మహ్మద్ తాజ్, మాచర్ల శంకర్(ధోబి శంకర్), యూసుఫ్‌ఖాన్, ఖాజా ఫసియొద్దీన్, తాహేర్ హుస్సేన్, మాచర్ల శ్రీనివాస్‌లను రిమాండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బీజేపీ నాయకుడి అరెస్ట్ లారీ అసోసియేషన్ సభ్యుల ఆందోళనకు మద్దతు తెలిపిన బీజేపీ నియోజకవర్గ నాయకుడు రావి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉన్న నేపధ్యంలో లారీ అసోసియేషన్‌కు మద్దతుగా రావి శ్రీనివాస్ పెట్రోల్ పంపులోని కార్యాలయానికి వెళ్లారు. అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు పేపర్ మిల్లు యాజమాన్యం, లారీ అసోసియేషన్ మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగా కాగజ్‌నగర్ పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. శనివారం సాయంత్రం జరిగిన గందరగోళం దృశ్యా పోలీసులు ఆదివారం పట్టణంలోని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద, లారీ అసోసియేషన్ కార్యాలయం ఎదుట పోలీసులు మోహరించారు. -
అడవి దొంగలెవరు?
సుప్రీంకోర్టు ముందున్న సమస్య, కాగజ్‌నగర్ మండలంలో సార్సాల శివార్ల అడవుల్లో జరిగిన దాడులను విచారిస్తున్న పోలీసుల ముందున్న సమస్య ఒకటే. ఎవరు అడవులను ఆక్రమిస్తున్నారు? తరతరాలనుంచి అడవుల్లో ఉంటున్న ఆదివాసులను ఎవరు తరిమేస్తున్నారు? పోడు వ్యవసాయం కొన్ని తెగల ఆదివాసులకు జీవన వృత్తి. గిరిజనేతర వ్యాపార రాజకీయ శక్తులకు అది లాభదాయకమైన వ్యాపారం. ఆదివాసులకు అడవుల్లో బతికే హక్కు, అటవీ ఉత్పత్తులను వాడుకునే అధికారం ఇవ్వాలని శతాబ్దాల కాలం నుంచి సాగిన ఉద్యమాల ఫలితంగా 2006లో అటవీవాసుల హక్కులను గుర్తిం చారు కాని విధివిధానాలను ఎంత దుర్మార్గంగా వక్రీకరిస్తున్నారో తెలియదా? ఆక్రమణ దారులెవరో అటవీ అధికారులకు తెలియదా? ఎమ్మెల్యేలు ఎవరికి అండగా ఉన్నారో తెలియదా? ఆక్రమణ దారుల అవినీతికా లేక ఆదివాసుల హక్కులకా ఈ చట్టాలు? అడవిలో సంపదను చూస్తున్న ప్రభువులకు ఆదివాసుల బ్రతుకులు కనిపించడం లేదా? ఆంగ్లేయుల పాలన, నిజాంపాలనలో కూడా ఇదే సమస్య తలెత్తింది. నిరంకుశ పాలన సాగిస్తున్న అటవీ అధికారులపైన, వారిని వాడుకుంటున్న పాలకులమీద ఉద్యమించారు. ఆస్ట్రియన్ సామాజిక శాస్త్రవేత్త హైమండార్ఫ్ నిజాం ఆహ్వానం పైన తెలంగాణ జిల్లాలకు వచ్చి ఆదిలాబాద్ తదితర ఆదివాసుల పరిస్థితులు పరిశీలించి వారికోసం ప్రత్యేక హక్కులను గుర్తించి అమలు చేయవలసిన అవసరం ఉందని వివరించాక కొంత అర్థం అయింది. గిరి జనుల భూములను గిరిజనులకే ప్రత్యేకించాలనే చట్టాలు కూడా వచ్చాయి. వన్ ఆఫ్ సెవెంటీ చట్టం కింద గిరిజనేతరులు భూములు కొన్నా వాటిని తిరిగి గిరిజనులకు ఇప్పించడానికి అధికారులకు, ప్రభుత్వాలకు అధికారాలు ఇచ్చారు. అభివృద్ధి చేస్తాం అంటూ అడవుల్లో జొరబడి, అమాయకులైన వారిని మోసం చేసి, వారి భూములు ఆక్రమించి వ్యాపారాలు చేసుకోవడం అభివృద్ధి అనీ, ఆక్రమించిన వారిలో కూడా పేదలు ఉన్నారని వారిని వెళ్లగొడితే హక్కులకు భంగం అని వాదించే మేధావులు చాలా మందే ఉన్నారు. డబ్బు సంపాదించడం, ఎన్నికల్లో గెలవడం తప్ప మరో లక్ష్యంలేని పార్టీలు, నేతలు పుట్టుకొచ్చిన ఈ కాలంలో ఆదివాసుల బతుకుల గురించి వారికి అర్థమయ్యేట్టు చెప్పడం సాధ్యమా?గిరిజనేతరులపై భూమి ఆక్రమణ నిషేధ చట్టం వన్ ఆఫ్ సెవెంటీకి తూట్లుపొడిచిన వారెందరో. అధికారులు ఆదివాసులను వెళ్లగొట్టి అడవులను ఆక్రమించి టేకును, ఎర్రచందనాన్ని ఇతర అటవీ సంపదను స్మగ్లింగ్ చేస్తూ ధనికులైపోతున్నారు. రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేలు మంత్రులు అవుతున్నారు. గెలిచే గుర్రాల పేరిట ఈ నేర సంపన్నులకే పార్టీ టికెట్లు అమ్ముకుని ఎమ్మెల్యేలుగా మార్చుతున్నారు. అటవీ అధికారులమీద పెత్తనం చెలాయించి తాము, తమ సోదరులు, అనుయాయులు ఆక్రమించిన భూములను రక్షించుకోవడానికి ఇటువంటి ఎమ్మె ల్యేలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి ఫిరాయిస్తున్నారు. అడవులను డొల్లచేసే నాయకులు ఎమ్మెల్యేలవుతారు. వారు కూడా పార్టీ ఫిరాయిస్తారు. దోచుకో, దాచుకో, కష్టమైతే పార్టీ మారు, అనే విధానానికి రాజకీయపార్టీలు ముగింపు పాడేదాకా అడవులు ఆక్రమిస్తారు, గనులు తవ్వుకుం టారు, ఏవో ఒకటి రెండు సందర్భాల్లో తప్ప పార్టీ ఫిరాయింపులన్నీ దోచింది దాచడానికే. ఆదివాసుల హక్కులపై అటవీ అధికారులు అన్యాయంగా చేస్తున్న దాడులు నిజమైన ఆదివాసులకు హాని కలిగిస్తున్నాయి. పై అధికారులు, రాజ కీయ నాయకులు మొత్తం అడవులకే ఎసరు పెడుతూ ఉంటే, కింది అధికారులు అవినీతిపరులై పోతున్నారు. అన్నలు ఎమ్మెల్యేలయితే తమ్ములు ఏ వ్యాపారమైనా చేస్తారేమో అని ఇటీవల సిర్పూర్ కాగజ్ నగర్ సార్సాల గ్రామంలో అటవీ అధికారిణి అని తపై జరిగిన దాడి నిరూపిస్తున్నది. ఎమ్మెల్యేగారు తమ్ముడిని రక్షించడానికి జనం ఏ విధంగా అబద్ధం చెప్పాలో ప్రబోధిస్తున్న వీడియో కూడా వైరల్‌గా ప్రసారం అవుతున్నది. 2009లో కోనేరు కోనప్పను స్మగ్లర్ వీరప్పన్‌తో పోల్చుతూ కేసీఆర్ ప్రచారం చేసిన నాటి వీడియోలు కూడా ప్రసారంలో ఉన్నాయి. బీఎస్పీ తరపున పోటీ చేసి గెలిచిన ఇతడిని తర్వాత తెరాస లోకి చేర్చుకున్నారు. ఇన్నాళ్లకు ఈ వీడియోలు బయటపడ్డాయి. ఈ విధంగా సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకు అధికార ఎంఎల్ఏపై కూడా కేసులుంటాయా? సోషల్ మీడియా ప్రభావంతో నేరాలపై వెల్లడవుతున్న ఎలక్ట్రానిక్ రికార్డులకు చట్టం ప్రకారం సాక్ష్య విలువ ఇచ్చారు. ఇవి కత్తిరించి అతికించినవి కావని ప్రయోగశాలలో తేలితే చాలు.. ఇందులో ఉన్న అంశాలను నిజాలుగా భావించాలి. న్యాయస్థానాలు ఇంట ర్నెట్లో ఉన్న పత్రాలకు, దృశ్యాలకు మళ్లీ బలపరిచే సాక్ష్యాలు అడగకుండా నేరగాళ్లను పట్టుకుని శిక్షించకపోతే ఈ దురన్యాయాలకు సాక్ష్యాలే ఉండవు. కొత్త టెక్నాలజీతో కొత్త నేరాలు చేసే ప్రభుత్వ నేరగాళ్లకు శిక్షలు పడేదెట్లా? వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
‘పోడు’ సమస్య ఇంకెన్నాళ్లు?
కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో ఆదివారం అటవీ అధికారులపై స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణ తన మనుషులతో సాగించిన దాడిలో ఎఫ్ఆర్ఓ అనిత తీవ్రంగా గాయపడటం పోడు భూముల సమస్యను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. కాగజ్‌నగర్ మండలం కొత్త సార్సాల శివారులోని 20 హెక్టార్ల భూమి విషయంలో కొంతకాలంగా స్థానిక రైతులకు, అటవీ అధికారులకు మధ్య వివాదం సాగుతోంది. తాము సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఆ భూములను ఖాళీచేయాలని అటవీశాఖ ఒత్తిడి చేస్తోంది. పోడుభూములంటే అటవీశాఖ స్వాధీనం చేసుకోదగిన భూములుగా, ప్రజలకు ఏ హక్కు లేని భూములుగా ప్రభుత్వం భావించాల్సిన అవసరం లేదు. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని పోడు భూములపై ఆదివాసీలకు హక్కు లేకుండా అటవీహక్కుల చట్టం 2006 పేరుతో ఆదివాసీ గ్రామా లను ఖాళీ చేయిస్తున్నారు. భూములు హరితహారాలుగా మారుతాయేమో కాని పోడు చేసుకుంటున్న జీవితాలకు ఆధారం పోతుందని, వారికి తామే ప్రత్యామ్నాయం చూపెట్టవలసిన బాధ్యత ఉందని ప్రభుత్వం గుర్తించటం లేదు. అటవీభూమిపై ఆదివాసీలకు హక్కు ఉంటుందని 1997లో సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. కానీ ఆదివాసీల భూములను పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలనే ప్రభుత్వ విధానం వల్ల ఆదివాసీలు నిర్వాసితులవుతున్నారు. నెలరోజుల క్రితం ఇదే జిల్లాలో కొలాంగోంది గ్రామ ఆదివాసీలపై పోలీసుల అండదండలతో అటవీశాఖ సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. అప్పుడు ఎవరూ ఆదివాసీలను రక్షించడానికి రాలేదు. అదే సిబ్బందిపై సార్సాలలో దాడిచేస్తే దానికి నాయకత్వం వహించింది అధికారపక్ష ప్రజాప్రతినిధి కనుక పోలీసు సిబ్బంది, ఇతర అధికారులు ప్రేక్షకపాత్ర వహించారు. ప్రభుత్వాల ‘చట్టబద్ధ పాలన’లో అధికారుల పాత్ర ఎలా ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రజాప్రతినిధులు తమను దుర్భాషలాడినా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో అధికారులు ఉండిపోవడం ఇది మొదటి సారి కాదు. గతంలో టీఆర్ఎస్ నేతలు హరీష్‌రావు, దానం నాగేందర్‌లు కూడా ఇలాగే వ్యవహరించారు. స్థానిక ఎస్ఐ మొదలుకొని జిల్లా ఎస్పీ వరకూ అందరి బదిలీలనూ ప్రజాప్రతినిధులే నిర్దేశిస్తున్నారు. కనుకనే వారిని ప్రశ్నించడం, ఎదిరిం చడం అధికారులకు సాధ్యం కావడం లేదు. ఏం జరిగినా వారు నిస్సహాయంగా ఉండిపోతున్నారు. సార్సాల దాడిని ఈ నేపథ్యంలోనే చూడాలి. సార్సాల ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుకొని అందరూ స్పందించారు. ఖండించారు. కానీ కొలాంగోంది ఆదివాసీ గ్రామాన్ని టైగర్ ప్రాజెక్టు పేరుతో అటవీ శాఖ సిబ్బంది దగ్గరుండి ఖాళీ చేయించినప్పుడు ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదు? ఒక ఆదివాసీ గ్రామాన్ని ధ్వంసం చేస్తుంటే వీరెవరికీ పట్టదా? ఆ గ్రామం 40 ఏళ్లనుంచి అక్కడ ఉంది. స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈ గ్రామాన్ని కుట్రపూరితంగా టైగర్ ప్రాజెక్టులో విలీనం చేయించారు. తమ రేషన్ కార్డులతోసహా అన్ని పత్రాలూ ఆయన దగ్గరే పెట్టుకున్నారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. కానీ ఎలాంటి పత్రాలూ లేవనే సాకుతో అటవీ శాఖ ఆ ఆదివాసీలను నిర్దాక్షిణ్యంగా బయటకు వెళ్లగొ ట్టింది. అంతేగాక ఆ సమస్య గురించి న్యాయస్థానా నికి తప్పుడు నివేదిక ఇచ్చింది. ఇది నేరం కాదా? ఈ జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో గిరిజనేతరుల ఆధిపత్యం అమలవుతోంది. అక్కడ 1/70 చట్టం ఉన్నా ఈ కబ్జాలు ఆగడం లేదు. గిరిజనులకు దక్కాల్సిన ఎన్నో సారవంతమైన భూములు గిరిజనేతరుల వద్ద ఉన్నాయి. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం కోనేరు సోదరులు వీటిని ప్రోత్సహిస్తున్నారు. కొలాంగోంది గ్రామాన్ని ధ్వంసం చేయడంలోనైనా, మొన్న అటవీ సిబ్బందిపై దాడి వెనకైనా ఈ కబ్జాల బాగోతమే ఉంది. కొలాంగోంది గ్రామానికి తిరిగి వెళ్లాలని ఆదివాసీలు ప్రయత్నిస్తున్నా అటవీశాఖ అనేక ఆటంకాలు కల్పిస్తోంది. ఇప్పటికీ ఆ జిల్లాలోని పలు గ్రామాలపై అటవీ సిబ్బంది దాడులు చేస్తున్నారు. వీటన్నిటినీ ఆపాలని పౌరహక్కుల సంఘం కోరుతోంది. కొలాంగోంది గ్రామస్తులపై అటవీ సిబ్బంది జరిపిన దాడినైనా, అటవీ సిబ్బందిపై కోనేరు కృష్ణ నేతృత్వంలో సాగిన దాడినైనా పౌరహక్కుల సంఘం ఖండిస్తోంది. ఈ రెండు రకాల దాడుల వెనకా కబ్జాలే ఉన్నాయి. కబ్జారాయుళ్లను నిరోధించి ఆదివాసీ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. అదే సమయంలో అటు ఆదివాసీలపైన, ఇటు అటవీ సిబ్బందిపైన దాడులు జరగకుండా నియంత్రించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉంది. పోడు భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పించి, వారిపై అటవీ సిబ్బంది జులుం చేయకుండా తగిన ఆదేశాలివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎన్. నారాయణరావు, ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం, తెలంగాణ మొబైల్ : 98667 34867 -
అత్యంత అమానుషం
తెలంగాణలోని కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం సార్సాల అటవీ ప్రాంతంలో ఆదివారం నాడు మహిళా అటవీ అధికారి(ఎఫ్ఆర్ఓ) అనితపైనా, ఇతర సిబ్బందిపైనా జరిగిన దాడి దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రభుత్వ విధానాలను అమలు చేయడానికెళ్లిన అటవీ శాఖ సిబ్బందిపై అధికార పక్ష ప్రజాప్రతినిధే అనుచరులను పోగేసుకుని దాడికి దిగడం ఆశ్చర్యం కలిగి స్తుంది. ఇది నాలుగేళ్లక్రితం ఏపీలో చంద్రబాబు పాలనలో తహసీల్దార్ వనజాక్షిపై అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన నాయకత్వంలోని మాఫియా గణం చేసిన దాడిని గుర్తుకు తెచ్చింది. అయితే ఆ దాడి విషయంలో బాబు తరహాలోకాక తెలంగాణ సీఎం కేసీఆర్ సార్సాల ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకున్నారు. దానికి నాయకత్వం వహించిన జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణతో ఆ పదవికి రాజీనామా చేయించారు. పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదంతం జరిగినప్పుడు చేష్టలుడిగి ఉండిపోయిన డీఎస్పీ, సీఐలను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ విధానాలను అమలు చేసే క్రమంలో సిబ్బందికి ఇబ్బందులు తలెత్తడం రివాజే. ఆ విధానాలతో నష్టపోతున్నామని భావించేవారు తమ వాదనను బలంగా వినిపించడం, భావోద్వేగాలు పెరిగి అడ్డుకోవడానికి ప్రయత్నించడం కూడా సర్వసాధారణం. కానీ కర్రలతో ప్రభుత్వ సిబ్బందిపై దాడికి తెగబడటం క్షమార్హం కానిది. అలాంటి చర్యల పర్యవసానంగా ఉన్న సమస్య పరిష్కారం కాకపోగా అది పూర్తిగా శాంతిభద్రతలకు సంబంధించిన వ్యవహారంగా మారి వికటిస్తుంది. పోడు భూముల సమస్య దాదాపు దేశమంతా ఉంది. అడవులపై తమకున్న సంప్రదాయ హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆదివాసులు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఈ విషయంలో ఎన్నో ఉద్యమాలు సాగాక అటవీ హక్కుల చట్టం అమల్లోకొచ్చింది. కానీ దశాబ్దకాలం గడిచినా, లోటుపాట్లను సవరించడానికి మధ్యలో దానికి సవరణలు చేసినా అది సక్ర మంగా అమలు చేయటం లేదన్నది గిరిజనుల ఆరోపణ. ఆ చట్టం ప్రకారం తమ సాగులో ఉన్న అటవీ భూములకు వ్యక్తిగత పట్టాలివ్వాలని, అలాగే గిరిజన గూడేలకు ఉమ్మడి హక్కు పత్రాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. వానా కాలం ప్రవేశించాక పోడు భూములు సాగు చేసుకుందామని గిరిజనులు ప్రయత్నించినప్పుడు అటవీ సిబ్బంది దాడులు చేయడం ఏటా షరా మామూలుగా సాగుతోంది. పోడు భూములకు పట్టాలున్నా అటవీ సిబ్బంది ఖాతరు చేయరని, విత్తనాలు చల్లు కున్న భూమిని బుల్డోజర్లతో, జేసీబీలతో నాశనం చేస్తారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. గిరిజ నుల దగ్గరున్న పట్టాలు సరైనవా, కాదా... అందులో సాగు చేసుకోవడానికి వారికి హక్కుందా లేదా అన్న సంగతిని నిర్ధారిస్తే పదే పదే ఈ ఉదంతాలు పునరావృతం కావు. మొక్కలు నాటాలనుకున్న భూమి తమదేనని అటవీ శాఖ అంటుంటే, తమకు పట్టాలున్నాయని గిరిజనులు చెబుతున్నారు. కొన్నిచోట్ల గిరిజనేతరులు సైతం ప్రవేశించి వారికి దక్కాల్సిన ప్రయోజనాలను కాజేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాజకీయ నాయకులు తమ పలుకుబడితో తాత్కాలికంగా సమస్య సద్దుమణి గేలా చూస్తున్నారు. కానీ మరుసటి ఏడాది తిరిగి ఇదంతా యధాప్రకారం సాగుతుంది. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా అటవీ సిబ్బందిపై దాడులు చేయడం, వారిని దుర్భాషలాడటం వంటి ఉదం తాలు చోటుచేసుకుంటాయి. ఈ ఉదంతాల్లో ఎందరో గిరిజనులు కేసుల్లో చిక్కుకుని జైలుపాలవు తున్నారు. కేవలం బతకడానికి, కుటుంబాలను బతికించుకోవడానికి ప్రయత్నించే క్రమంలో గిరిజ నులు ఇన్ని ఇబ్బందులు పడటం విషాదకరం. అటవీ భూములను ప్రాజెక్టుల పేరు చెప్పి, అభ యారణ్యాల పేరు చెప్పి, రిజర్వ్ ఫారెస్టు భూములుగా చూపి ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుం టుంటే... వాటిపై ఆధారపడి జీవించే గిరిజనుల బతుకు అధోగతి అవుతోంది. గత నెలలో ఇదే కాగజ్‌నగర్ మండలం కొలాంగోందిగూడలో 67మంది గిరిజనులను టింబర్ డిపోలో నిర్బంధిం చిన ఉదంతం ఇటువంటిదే. హైకోర్టు ధర్మాసనం జోక్యం చేసుకుని నిర్బంధితులను విడుదల చేయ డంతోపాటు వారికి ఆర్నెల్లలో భూమి, ఏడాదిలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆదేశించింది. గిరిజనుల జీవనాధారం దెబ్బతినకుండా, వారిని అడవికి దూరం చేయకుండా సమస్యను ఎలా పరిష్కరించాలన్న అంశంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. హరితహారమో, మరే ఇతర కార్య క్రమమో మొదలెట్టినప్పుడు... లేదా ఒక విధానాన్ని రూపొందించే ముందు ఆ సమస్యతో సంబంధం ఉన్న అన్ని పక్షాలనూ పిలిచి మాట్లాడటం, ప్రజాప్రతినిధులను కూడా అందులో భాగ స్వామ్యం చేయడం, అందరి అంగీకారంతో ఒక సామరస్యపూర్వక పరిష్కారాన్ని సాధించడం అవ సరం. ఎవరి దారి వారిదన్నట్టు ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించడం, దాన్ని అమలు చేయటం కోసం అధికారులు రంగంలోకి దిగడం, ప్రజాప్రతినిధులు జనాన్ని సమీకరించి ఆ అధికా రులపై దాడులకు పూనుకోవడం ప్రమాదకరమైన పర్యవసానాలకు దారితీస్తుంది. ఆదివారం నాటి ఉదంతంలో అనితను లక్ష్యంగా చేసుకుని కోనేరు కృష్ణ, ఆయన అనుచరులు సాగించిన దాడే ఇందుకు రుజువు. అంతమంది జనాన్ని పోగేసి ఆమెపైనా ఇతర సిబ్బందిపైనా దాడికి దిగడానికి బదులు... తానూ, తన సోదరుడు అధికార పక్ష ప్రజాప్రతినిధులు కనుక ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రులతో చర్చించి స్థానిక సమస్యలేమిటో చెప్పడం, ఇప్పుడు అమలవుతున్న విధానంలో సవరణలు సూచించడం, అటవీ హక్కుల చట్టం సక్రమంగా అమలయ్యేలా చూడటం వంటివి చేయాలి. అందుకు భిన్నంగా అధికారులనూ, సిబ్బందినీ దాడులతో బెదరగొడితే సమస్య తీరు తుందని వారెలా అనుకున్నారో అనూహ్యం. సార్సాల దాడి ఉదంతం పోడు భూముల చుట్టూ అల్లుకున్న సమస్యల తీవ్రతను తెలియజేసింది గనుక తెలంగాణ ప్రభుత్వం దీనిపై దృష్టి సారిం చాలి. భవిష్యత్తులో సార్సాల ఉదంతం వంటివి పునరావృతం కాకుండా అందరి సహకారంతో సామరస్యపూర్వక పరిష్కారం సాధించాలి. -
‘అనితపై దాడి హేయమైన చర్య’
సాక్షి, హైదరాబాద్ : మహిళా అటవీ అధికారిణి అనితపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ అధికారులు విధులు నిర్వహిస్తున్న సమయంలో టీఆర్ఎస్ నాయకులు కర్రలతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడడం దారుణమన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న టీఆర్ఎస్ నాయకులు ఇలా ప్రభుత్వ అధికారులపై దాడులకు పాల్పడం హేయమైన చర్యలని కోమటిరెడ్డి అన్నారు. దాడులను ఎదుర్కొవడానికి అటవీ శాఖ అధికారులకు ప్రభుత్వం ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు తిరిగి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. (చదవండి : మహిళా అటవీ అధికారిపై ప్రజాప్రతినిధి దాడి) అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కుము రంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం సార్సాల అటవీ ప్రాం తంలో భూమిని చదును చేసి మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారుల బృందంపై అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, కుమురంభీం జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణతో పాటు ఆయన అనుచరులు యథేచ్ఛగా దాడి చేశారు. ఈ ఘటనలో మహిళా అటవీ అధికారిణి అనిత చేయి విరగడంతో పాటు పలువురు అటవీ సిబ్బందికి గాయాలయ్యాయి. -
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వీడియో వైరల్
సాక్షి, కొమురం భీం ఆసిఫాబాద్ : సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే సోదరుడు కోనేరు కృష్ణ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులపై ఆదివారం దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడిని ఎమ్మెల్యే సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దాడికి సంబంధించిన కారణాలను విలేకరులకు ఎలా చెప్పాలో ఆదివాసీలు, గిరిజనులకు ఆయన హితబోధ చేశారు. తప్పంతా అధికారులదే అన్నట్లుగా ఉండాలని ఎమ్మెల్యే కోనప్ప ఆ వీడియోలో చెప్పడం గమనార్హం. ఆ వీడియోలో ‘ ఇప్పుడు నేను విలేకరులను పిలిపిస్తున్నా. వాళ్ల ముంగిట చెప్పండి. భూములు దగ్గరకు వెళ్లొద్దని రోజు వచ్చి బెదిరిస్తున్నారు. భూముల్లో తవ్వకాలు జరిపారు. మా భూములు లోపల ఉన్నాయి. అక్కడకు వెళ్లకుండా మమ్మల్ని బెదిరిస్తున్నారు. 15 రోజుల క్రితం వచ్చి కొట్టారు. ఇప్పుడు మళ్లీ కొట్టారు. కొట్టాక అందరం దున్నొద్దని ట్రాక్టర్ల దగ్గరకు వెళ్లాం. అప్పుడే గొడవ అయింది. ఇదంతా చెప్పాలి. విలేకరులను పిలిపిస్తా. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి.’ అంటూ ఎమ్మెల్యే పేర్కొనడం విశేషం. చదవండి: మహిళా అటవీ అధికారిపై ప్రజాప్రతినిధి దాడి కాగా అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూమిని చదును చేసి మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారుల బృందంపై అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, కుమురంభీం జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణతో పాటు ఆయన అనుచరులు యథేచ్ఛగా దాడి చేశారు. ఈ ఘటనలో ఓ మహిళా అటవీ అధికారిణి అనిత చేయి విరగడంతో పాటు పలువురు అటవీ సిబ్బందికి గాయాలయ్యాయి. కుము రంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం సార్సాల అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. అధికార పార్టీ నాయకుడు, సాక్షాత్తూ జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్, ఎమ్మెల్యే సోదరుడు ఇందుకు బాధ్యుడు కావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే సోదరుడితో సహా 16మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ సంఘటనపై ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. దాడిని ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కారాదని హెచ్చరించారు. ఇక దాడిలో గాయపడ్డ ఎఫ్ఆర్వో అనితను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. భారీగా మోహరించిన పోలీసులు సల్సాల గ్రామ అటవీప్రాంతంలో భారీ పోలీస్ బందోబస్తు నడుమ ట్రాక్టర్లతో అటవీ శాఖ అధికారులు సోమవారం భూమిని చదును చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 200మంది పోలీసులు మోహరించారు. ఎఫ్ఆర్వోపై దాది చేసిన కోనేరు కృష్ణతో పాటు 15మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఆటవిక దాడి
-
మహిళా అధికారిపై ప్రజాప్రతినిధి దాడి
సాక్షి, ఆసిఫాబాద్: పోడు భూమి రణరంగమైంది. అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూమిని చదును చేసి మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారుల బృందంపై అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, కుమురంభీం జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణతో పాటు ఆయన అనుచరులు యథేచ్ఛగా దాడి చేశారు. ఈ ఘటనలో ఓ మహిళా అటవీ అధికారిణి చేయి విరగడంతో పాటు పలువురు అటవీ సిబ్బందికి గాయాలయ్యాయి. కుము రంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం సార్సాల అటవీ ప్రాం తంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. అధికార పార్టీ నాయకుడు, సాక్షాత్తూ జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్, ఎమ్మెల్యే సోదరుడు ఇందుకు బాధ్యుడు కావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఈ ఘటనపై అటు అధికార టీఆర్ఎస్తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు కూడా తీవ్రంగా స్పందించాయి. అటవీ అధికారులపై దాడి చేసిన వారు ఎవరైనా చట్టం ముందు సమానులేనంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేయగా, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విపక్షాలు మండిపడ్డాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం కింద అరెస్టు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటన స్థానిక పోలీసు అధికారులకు కూడా చిక్కు తెచ్చిపెట్టింది. ఘటనపై వెంటనే స్పందించిన ప్రభుత్వం.. ఘటనాస్థలంలో పోలీసు బందోబస్తు ఉండి కూడా ఘర్షణను నివారించి దాడిని అడ్డుకోలేకపోవడంతో కాగజ్‌నగర్ డీఎస్పీ, రూరల్ సీఐపై సస్పెన్షన్ వేటు వేసింది. మహిళా అధికారిణి చేయి విరిగేలా కర్రలతో దాడి చేసిన ఈ ఘటన కారణంగా కోనేరు కృష్ణ ఇటీవలే వచ్చిన జడ్పీ వైస్ చైర్మన్ పదవి కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ దాడికి ముఖ్య కారకుడైన కోనేరు కృష్ణతో పాటు 16 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇదీ జరిగింది! కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ రేంజ్ పరిధి కాగజ్‌నగర్ మండలం కొత్త సార్సాలలో.. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కోల్పోయిన అటవీ ప్రాంతానికి బదులు ఇక్కడ మొక్కలు నాటాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఎఫ్ఆర్వో అనితతోపాటు సిబ్బంది గ్రామ శివారు కంపార్ట్మెంట్ నంబర్ 138, 139లలో 20 ఎకరాల భూమిని చదును చేయించేందుకు ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మూడు ట్రాక్టర్లతో వెళ్లారు. దీంతో అదే స్థలంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న సార్సాల గ్రామస్తులు వెంటనే అక్కడకు చేరుకుని అటవీ అధికారులను అడ్డుకున్నారు. అటవీ అధికారుల సమాచారంతో కాగజ్‌నగర్‌రూరల్ సీఐ వెంకటేశ్, టౌన్ సీఐ కిరణ్‌కుమార్, కాగజ్‌నగర్‌రూరల్ ఎస్సై రాజేశ్వర్ అక్కడకు చేరుకుని అటవీ అధికారులు చదును చేసేలా చూశారు. దీంతో విషయం తెలుసుకున్న సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణరావు తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. ప్రాధేయపడినా కనికరించలేదు కోనేరు కృష్ణతో పాటు ఆయన అనుచరులు వచ్చిరాగానే కర్రలతో అటవీ అధికారులపై దాడులకు పాల్పడ్డారు. చెప్పేది వినాలని ట్రాక్టర్‌పైకి ఎక్కి వివరించేందుకు ప్రయత్నించిన ఎఫ్ఆర్వో అనితను విచక్షితరహితంగా కొట్టారు. దీంతో ఆమె కుడి చేయి విరిగిపోయింది. చూపుడు వేలు, మధ్య వేలు చిట్లిపోయాయి. తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెతో పాటు పలువురు అటవీ సిబ్బంది సైతం తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఎఫ్ఆర్వోను కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సనందించారు. కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో రాజరమణారెడ్డి ఫిర్యాదు మేరకు మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశారు. కోనేరు కృష్ణను అరెస్టు చేసి జైనూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు బాధ్యతలను ఆసిఫాబాద్ డీఎస్పీకి అప్పగించారు. పోలీసుల ప్రేక్షక పాత్ర అటవీ అధికారులపై కోనేరు కృష్ణ, అతని అనుచరులు విచక్షణారహితంగా కర్రలతో దాడులకు పాల్పడుతున్నా అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం విశేషం. వీడియోల్లో ఈ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబయ్య, రూరల్ సీఐ వెంకటేశ్‌పై నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు. అధిష్టానం సీరియస్ అటవీ అధికారులపై దాడి ఘటనపై టీఆర్ఎస్ అధిష్టానం స్పందించింది. జెడ్పీవైస్చైర్మన్తో పాటు జెడ్పీటీసీ పదవికి వెంటనే రాజీనామా చేయాల్సిందిగా కోనేరు కృష్ణారావును ఆదేశించింది. దీంతో ఆయన రాజీనామాను పార్టీ నాయకులతో జెడ్పీ సీఈవో రాజేశ్వరికి పంపారు. అనంతరం కోనేరు కృష్ణ విలేకరులతో మాట్లాడుతూ కావాలనే అటవీ అధికారులు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్పందిస్తూ.. ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్న వారిపై అటవీ అధికారులు దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్న వారి భూముల్లో మొక్కలు నాటడం దారుణమన్నారు. అంతా జీ హుజూర్ అనాల్సిందే సిర్పూర్ నియోజకర్గంలో ప్రజాప్రతినిధులు చెప్పినట్లు నడుచుకోని అధికారులకు ఇలాంటి ఘటనలే ఎదురవుతున్నాయి. గతంలో అక్రమ బెల్లం రవాణా అడ్డుకున్నందుకుగాను ఎమ్మెల్యే తన అనుచరులతో అప్పటి ఎక్సైజ్ అధికారిణి మంగను బహిరంగానే బూతులు తిడుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఇక ప్రస్తుత ఎఫ్డీవోకు ముందు విధులు నిర్వర్తించిన నర్సింహారెడ్డి అక్రమ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారని మంత్రి స్థాయిలో ఒత్తిడి తెచ్చి మరీ బదిలీ చేయించారు. ఇక అన్నదమ్ముళ్లిద్దరూ నియోజకవర్గ పోలీసు వ్యవస్థను మొత్తం గుప్పిట పెట్టుకుని పెత్తనం చెలాయిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కాగజ్‌నగర్‌రూరల్ పరిధిలో ఉన్న ఓ బ్రాందీ షాపు ఏజెన్సీ కింద నోటిఫైడ్ కాగా దీన్నుంచి మహారాష్ట్రకు అక్రమంగా మద్యం సరఫరా చేస్తూ ఈ సోదరుల అనుచరులు పోలీసులకు పట్టుబడ్డారు. ఇవేకాక అమాయకుల భూములను కబ్జా చేయడం, ప్రతీ పనుల్లో వాటాలు లేకపోతే పోలీసులతో బెదిరించి అట్రాసిటీ కేసులు పెట్టించడం షరామామూలుగా మారింది. ఇక్కడ పత్రికల్లో తనకు వ్యతిరేకంగా వార్తలు రాసిన వారిపైనా కేసులు పెట్టించారు. ఇప్పటికీ పలువురు పట్టణ విలేకరులు కేసులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే సంబంధీకులే అధికంగా రోడ్డు పనులు, టెండర్లు పొందారు. ఏం జరగాలన్నా వారు చెప్పిందే వేదంగా పరిస్థితి తయారైంది. దీంతో సిర్పూర్లో పనిచేయాలంటే లొంగిఉన్న వారే చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఇలాంటి అక్రమ దందాలను అరికట్టేందుకు అప్పటి ఎస్పీ కల్మేశ్వర్ సింగనేవార్ ఓ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీంను ఏర్పాటు చేసి గుట్కా, మట్కా, పీడీఎస్ బియ్యం, బెల్లం, మద్యం, నకలీ విత్తనాలను అడ్డుకున్నారు. అక్రమ కలప రవాణా చేసేందుకు వీల్లేకుండా చేశారు. దీంతో పూర్తిగా టాస్క్‌ఫోర్స్‌ను ఎత్తేయడమే గాక ఎస్పీని సైతం ఉన్నతాధికారులతో ఒత్తిడి తెచ్చీ మరీ బదిలీ చేయించారు. పోడుతో రాజకీయం గిరిజనులను ఆసరా చేసుకుని చాలా మంది రాజకీయంగా లబ్ధి పొందుతున్నారు. జిల్లాలో ఆర్‌ఎఫ్‌ఆర్ పొందిన గిరిజనులు 12వేల మంది ఉంటే అంతకు రెట్టింపు సంఖ్యలో గిరిజన, గిరిజనేతరులు పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అటవీ అధికారులు ఏటా ఖరీఫ్ సీజన్లో అక్రమంగా సాగు చేసిన వారిని గుర్తించి తొలగించే ప్రయత్నం చేస్తే ఇక్కడి ఓ నాయకుడు వచ్చి రాజకీయం చేస్తారు. దీంతో పోడు పూర్తిగా రాజకీయ అస్త్రంగా మారింది. ట్రాక్టర్లు సీజ్ చేసిప్పుడు విడిపించుకోవడంతో పాటు గిరిజనుల ముసుగులో అనేక మంది రాజకీయ నాయకులు విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడి అక్రమ పట్టాలు కూడా పొందారు. కాగజ్‌నగర్ డివిజన్ మహారాష్ట్రలోని ‘తాడోబా అభయారణ్యం టైగర్ కారిడార్’గా ఉండడంతో పాటు అంతరించిపోతున్న పొడుగు ముక్కు రాబందులు కూడా ఈ డివిజన్లో ఉండడంతో అటవీ అధికారులపై మరింత ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రత్యామ్నాయ అటవీ పెంపకం కోసం 120 హెక్టార్లలో అడవులు పెంచాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇదే ప్రాంతంలో అనేక మంది పోడు వ్యవసాయం చేయడం వారికి రాజకీయ నాయకుల అండ ఉండడంతో మొక్కల పెంపకం క్లిష్టంగా మారుతోంది. జిల్లాలో నిషేధాజ్ఞాలు ఈ ఘటన తర్వాత జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కుమురంభీం జిల్లా పోలీసు శాఖ నిషేధాజ్ఞలు విధించింది. కోనేరు కృష్ణ, తన అనుచరుల అరెస్టు తర్వాత కొంత మంది పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి చేరుకుని నిరసనలు తెలుపుతారని ప్రచారం జరిగింది. దీంతో ముందు జాగ్రత్తగా కృష్ణను అదుపులోకి తీసుకుని జైనూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 16 మందిపై కేసు నమోదు అటవీశాఖ అధికారులపై దాడికి పాల్పడిన 16 మందిపై కేసు నమోదు చేశాం. దాడికి పాల్పడిన కోనేరు కృష్ణతో పాటు ఆయన అనుచరుడు పోశం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. వీరితోపాటు మొత్తం 16 మందిపై కేసు నమోదు చేశాం. దాడిలో మరో 30–40 మంది ఉన్నారు. విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షిస్తాం. అటవీశాఖ అధికారుల విధులకు ఆటంకం కలిగించి దాడి చేసిన నేపథ్యంలో సెక్షన్ 147, 148, 307, 353, 332, 427, ఆర్/డబ్ల్యూ 149 కింద కేసులు నమోదు చేశాం. – మల్లారెడ్డి, కుమురంభీం జిల్లా ఎస్పీ బాధ్యులపై చర్యలు తీసుకుంటాం కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం సార్సాలలో అటవీ అధికారులపై జరిగిన దాడిని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఖండించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఏమైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి కాని ఇలా దాడులు చేయడం సరికాదన్నారు. అటవీశాఖ అధికారులపై ఎవరు దాడులు చేసినా సహించేది లేదన్నారు. – ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర అటవీశాఖ మంత్రి దాడి చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు కాగజ్‌నగర్‌లో అటవీ శాఖ అధికారులు, సిబ్బందిపై దాడికి పాల్పడ్డ వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారన్నారు. ఘటన విషయం తెలియగానే స్థానిక పోలీసు ఉన్నతాధికారులతో తాను మాట్లాడానని, బాధ్యులెవరైనా సరే చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. – హోంమంత్రి మహమూద్ అలీ -
కాగజ్ నగర్ డీఎస్పీ, సీఐపై సస్పెన్షన్ వేటు
సాక్షి, ఆదిలాబాద్ : సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఫారెస్ట్ అటవీ అధికారిణి అనితపై జరిగిన దాడిని వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా విధులను సక్రమంగా నిర్వహించని కాగజ్ నగర్ డీఎస్పీ సాంబయ్య, సీఐ వెంకటేశ్వర్లను సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. దాడి సంఘటనకు సంబంధించి మొత్తం 30 మందిని అదుపులోకి తీసుకున్నామని, అందులో 16మందిపై పలు సెక్షన్ల కింద కేసుల నమోదు చేసినట్లు మల్లారెడ్డి పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన కోనేరు కృష్ణ .. ‘నెల రోజులుగా ఫారెస్ట్ అధికారులు ఇక్కడి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామస్తులకు, అటవీ అధికారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రైతులు ఫోన్ చేస్తేనే మేము అక్కడికి వెళ్లాం. మేము ఎవరిపై దాడి చేయలేదు’ అని తెలిపారు. దాడిలో గాయపడ్డ ఎఫ్ఆర్వో అనిత ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కోనేరు కృష్ణ... జెడ్పీ వైస్ చైర్మన్ పదవితో పాటు, జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. -
ఎఫ్ఆర్వోపై దాడిని ఖండించిన జీవన్ రెడ్డి
-
ఎఫ్ఆర్వోపై దాడిని ఖండించిన జీవన్ రెడ్డి
కాగజ్‌నగర్ : సిర్పుర్ కాగజ్‌నగర్‌లో అటవీశాఖ అధికారిణిపై ఆదివారం ఉదయం జరిగిన దాడిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం పోడు భూముల్లో చెట్లను నాటాలని అదేశించి.. ఎమ్మెల్యే అనుచరులతో అధికారులపై దాడి చేయించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. 2008- 2009లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పోడు భూమూలపై గిరిజనులకు పూర్తి అధికారాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు గిరిజనలను బలవంతంగా వారికి కేటాయించిన పోడు భూముల నుంచి వెళ్లగొట్టటం దురదృష్టకరమంటూ మండిపడ్డారు. ఎఫ్ఆర్వో అనితపై కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ దాడిని ఖండిస్తున్నామని, పోడు భూముల రక్షణకు స్థానిక ఎమ్మల్యే బాధ్యతలు తీసుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. పోడు భూములను గిరిజనుల నుంచి లాక్కునే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం సరికాదన్నారు. -
స్వేచ్ఛాయుత ఓటింగ్‌కు చర్యలు
కాగజ్‌నగర్: సిర్పూర్ నియోజకవర్గంలో నిర్వహించే శాసనసభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలోని 256 పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు, సౌకర్యాలు కల్పించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలోని సమస్యాత్మక, అతి సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించ డం, పోలింగ్ స్టేషన్ల్లో వెబ్ కాస్టింగ్ చేయానికి చర్యలు తీసుకుంటున్నారు. కాగజ్‌నగర్ మండలంలోని భట్టుపల్లిలో పింక్ పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రంలో అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు అందరూ మహిళలే ఉంటారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికలు సజావుగా నిర్వహించేలా ఎన్నికల అధికారులు చురుగ్గా చర్యలు చేపడుతున్నారు. సమస్యాత్మక కేంద్రాలు.. సమస్యల కేంద్రాలు సిర్పూర్ నియోజకవర్గంలోని 40 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించగా, బెజ్జూర్ మండలంలోని మర్తిడి గ్రామంలో రెండు అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. పెంచికలపేట్ మండలంలోని మోర్లి గూడ గ్రామంతోపాటు గొండి, రేగులగూడ, మారేపల్లి, మెట్పల్లి, కోసిని, కమ్మర్గాం, అంబగట్టు, అచ్చేల్లి, చింతకుంట, గిరివెళ్లి, మొట్లగూడ తది తర గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదని అధి కారులు గుర్తించారు. మొర్లిగూడ గ్రామానికి కనీసం ద్విచక్రవాహనం కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొని ఉంది. పలు గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గుట్టలు ఎక్కిదిగాల్సి వస్తుంది. నిధుల మంజూరు కోసం సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గ ఓటర్లు.. నియోజకవర్గంలోని 146 గ్రామ పంచాయతీలు ఉండగా 256 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నూతన ఓటరు జాబితా వివరాల ప్రకారం నియోజకవర్గంలో మొత్తం 187387 ఓటర్లు నమోదు చేసుకున్నారు. అందులో పురుషులు 94786, మహిళలు 92570, ఇతరులు 31 మంది ఉన్నారు. ఇందులో 3243 మంది దివ్యాంగులు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మంచిర్యాల జిల్లాలోని భీమిని మండలంలోని కేస్లాపూర్, గుడిపేట, చిన్నతిమ్మాపూర్, పెద్ద తిమ్మాపూర్, కన్నెపల్లి మండలాల్లోని సాలిగాం, ఐతపూర్ గ్రామాల్లో 6 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగకపోవడంతో పాత నియోజకవర్గంలోనే ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. నియోజకవర్గంలో అత్యల్పంగా 152 ఓటర్లు ఉన్న కేంద్రం చిత్తమా (చింతలమానేపల్లి మండలం) కాగా, అత్యధికంగా 1384 ఓటర్లు ఉన్న కేంద్రం కాగజ్‌నగర్ పట్టణంలోని బాలభారతి పోలింగ్ కేంద్రం నిలిచింది. పట్టణంలోని బాలవిద్యమందిర్ కేంద్రంలో అత్యధిక 731 మంది మహిల ఓటర్లు, చింతలమానేపల్లి మండలంలోని చిత్తామాలో అత్యల్ప 75 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. పట్టణంలోని ఓల్డ్ హైస్కూల్లో అత్యధిక 669 మంది పురుష ఓటర్లు ఉండగా, చిత్తామాలో 175 మంది అత్యల్పంగా పురుష ఓటర్లుగా నమోదయ్యారు. వెబ్ కాస్టింగ్‌కు చర్యలు.. కాగజ్‌నగర్ పట్టణంలో 44 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, వివిధ మాండలాల్లో 212 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 3జీ, 4జీ ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ కోసం ఎంపిక చేశారు. 98 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించడానికి చర్యలు చేపట్టారు. ఎన్నికల నిర్వహణ కోసం 1129 మంది సిబ్బందిని నియమించారు. పోలింగ్ కేంద్రాల వివరాలు.. నియోజకవర్గంలో మొత్తం 256 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్ పట్టణంలో 44, గ్రామాల్లో 47, సిర్పూర్ మండలంలో 29, కౌటాల మండలంలో 29, చింతలమానేపల్లి మండలంలో 29, బెజ్జూర్ మండలంలో 25, పెంచికలపేట్ మండలంలో 16, దహెగాం మండలంలో 31, భీమిని మండలంలో 4, కన్నెపల్లి మండలంలో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలను 29 రూట్లుగా విభజించారు. ఇందులో 30 బస్సు, 16 మినీ బస్సులు, 16 టాటా ఏసీ వాహనాలు, 2 బులేరో, 2 ట్రాక్టర్లు ఏర్పాటు చేయనున్నారు. సిర్పూర్ నియోజకవర్గం పకడ్బందీ నిర్వహణ... సిర్పూర్ నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికలు నిర్వహణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. సమస్యాత్మక కేంద్రాలతోపాటు అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాం. కొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. నియోజకవర్గంలో 6 రోడ్లు నిర్మించడానికి పంచాయతీరాజ్ శాఖ దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఓటింగ్రోజు 98 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించడానికి సిబ్బందిని నియమించే ప్రక్రియ కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీటి, మరుగుదొడ్లు, వైద్యం అందేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా ఓటు వినియోగించుకునే చర్యలు చేపడుతున్నాం. -జి.శివకుమార్, ఎన్నికల నిర్వహణ అధికారి, (కాగజ్‌నగర్ ఆర్డీవో) -
సిర్పూర్ కాగజ్‌నగర్‌కు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ప్రత్యేక మెమూ రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (07035) మెమూ ట్రైన్ అక్టోబర్ 4వ తేదీ ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ ట్రైన్ (07036) అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.