కాగజ్‌నగర్ : సిర్పుర్ కాగజ్‌నగర్‌లో అటవీశాఖ అధికారిణిపై ఆదివారం ఉదయం జరిగిన దాడిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం పోడు భూముల్లో చెట్లను నాటాలని అదేశించి.. ఎమ్మెల్యే అనుచరులతో అధికారులపై దాడి చేయించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. 2008- 2009లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పోడు భూమూలపై గిరిజనులకు పూర్తి అధికారాలు ఇచ్చిందని గుర్తు చేశారు.
ఇప్పుడు గిరిజనలను బలవంతంగా వారికి కేటాయించిన పోడు భూముల నుంచి వెళ్లగొట్టటం దురదృష్టకరమంటూ మండిపడ్డారు. ఎఫ్‌ఆర్వో అనితపై కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ దాడిని ఖండిస్తున్నామని, పోడు భూముల రక్షణకు స్థానిక ఎమ్మల్యే బాధ్యతలు తీసుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. పోడు భూములను గిరిజనుల నుంచి లాక్కునే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం సరికాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment