బోరు బావిలో పడిపోయిన నాలుగేళ్ల చిన్నారి | Four Years Child Struck in Bore well in Madhya Pradesh | Sakshi
Sakshi News home page

బోరు బావిలో పడిపోయిన నాలుగేళ్ల చిన్నారి

Published Sat, Mar 10 2018 7:48 PM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM

మరో పసి ప్రాణం కోసం తల్లిదండ్రుల గుండెలవిసేలా విలపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో నాలుగేళ్ల ఓ చిన్నారి బోరు బావిలో పడిపోయింది. దేవాస్‌ జిల్లా ఉమరియా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

తల్లిదండ్రులతో పోలానికి వెళ్లిన ఆ చిన్నారి.. ఆడుకుంటూ అటుగా వెళ్లి బావిలో పడిపోయింది. అది గమనించిన తల్లి గ్రామస్థులను అప్రమత్తం చేసింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగి ఆ పాపను బయటికి తీసేందుకు యత్నిస్తున్నారు. సుమారు 40 అడుగుల లోతున బోర్‌ బావిలో పాప ఇరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement