సాక్షి, హైదరాబాద్: ఫిర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన మనవరాలితో సహా డ్రైనేజీ గుంతలో పడిపోయారు. వివరాలు... బుద్ధానగర్‌లో లైఫ్ స్ప్రింగ్ ఆస్పత్రి వద్ద డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం తీసిన గుంత నేటి వర్షానికి నిండిపోయింది. ఈ క్రమంలో వైద్యం కోసం అక్కడికి వచ్చిన ఓ మహిళ, రెండు నెలల వయస్సుల గల తన మనవరాలితో కలిసి వెళ్తుండగా.. అకస్మాత్తుగా గుంతలో పడ్డారు. విషయాన్ని గమనించిన స్థానికులు వారిద్దరిని రక్షించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కాగా మేయర్, అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్షం: గుంతలో పడ్డ బామ్మా, మనవరాలు
Published Thu, Mar 19 2020 8:51 PM | Last Updated on Fri, Mar 22 2024 11:11 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement