‘మీరు చేస్తున్న దోపిడీని చూస్తూ ఉండటానికా మేం 2014లో మీకు మద్దతిచ్చింది’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జనసేన పార్టీ ఏర్పడి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బుధవారం గుంటూరు జిల్లా కాజా వద్ద ఆవిర్భావ మహాసభ నిర్వహించారు. సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు.