భార్యను తుపాకీతో కాల్చి పరారైన భర్త | Karimnagar Man Shoots Pregnant Wife | Sakshi
Sakshi News home page

భార్యను తుపాకీతో కాల్చి పరారైన భర్త

Published Sat, Aug 4 2018 9:56 AM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

కరీంనగర్‌ జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణ కాలనీలోని బుడగ జంగాల కాలనీకి చెందిన తూర్పాటి స్వప్న(35)ను ఆమె భర్త కనకయ్య తుపాకీతో కాల్చి పరారయ్యాడు. ఈ ఘటనలో బుల్లెట్‌ ఆమె తొడభాగం నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు స్పందించి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో  సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకుని విచారణ  చేపట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement