ఆయన ఒక్క మాట ఎందరినో ప్రభావితం చేసి ఉద్యమానికి ఊపిరిపోసింది. ఆయన ఒక్క పిలుపు కోట్ల మందిని ఒక్కటి చేసి 60 యేళ్ల కల నెరవేరాల చేసింది. ఆయన ప్రసంగానికి ఎవరైనా ఫిదా కావల్సిందే. వ్యూహాలు రచించడంలో వాటి అమలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. కలగా మిగిలిపోతుందేమో అనుకున్న తెలంగాణ సాధనను పట్టువదలని విక్రమార్కుడలా సాధించి చూపించారా ఆయన. బంగారు తెలంగాణ నినాదంతో అధికారం సాధించి రాష్టం ఏర్పడిన అనతి కాలంలోనే అభివధ్దిలో దూసుకుపోయేలా చేస్తున్న అభివృద్ధి సారథి ఆయన. నెర్రులు బారిన నేలకు నీటి తడి అందించిన భగీరదుడు ఆయన. ఆయన మరెవరో కాదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.