కాంగ్రెస్,టీఆర్‌ఎస్‌ది డమ్మీ పోరాటం | KCR should go to London and stay there for 5 years-Modi | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్,టీఆర్‌ఎస్‌ది డమ్మీ పోరాటం

Nov 28 2018 7:06 AM | Updated on Mar 20 2024 4:08 PM

‘‘నిజామాబాద్‌ను లండన్‌గా మారుస్తానని ముఖ్య మంత్రి అన్నారు. స్మార్ట్‌ సిటీ చేస్తానన్నారు. కానీ ఇక్కడ విద్యుత్, తాగునీరు, రోడ్ల వంటి మౌలిక సదుపాయాల కోసం కూడా నిజామాబాద్‌ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి నిజామాబాద్‌ను లండన్‌గా ఎంత మేరకు మార్చారో చూద్దామని హెలికాప్టర్‌లో చక్కర్లు కొట్టి చూశా. దేశంలో ఆర్థిక పరిస్థితి బాగోలేని రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతాలు, పట్టణాల్లో కూడా పరిస్థితి ఇంతకన్నా మెరుగ్గా ఉంది. ముఖ్యమంత్రి గారు... లండన్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఓ ఐదేళ్లు అక్కడ ఉండి రండి. నిజామాబాద్‌లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణాలు చూస్తుంటే అక్కడ డ్రైనేజీ కడుతున్నారా లేక పట్టణాన్ని డ్యామేజీ చేసే పనులు చేస్తున్నారా?’’అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఇంటింటికీ గోదావరి నుంచి తాగునీరు ఇవ్వకపోతే ఓట్లు అడగనన్న కేసీఆర్‌ నీళ్లివ్వకుండానే ఓట్లడిగేందుకు వచ్చారని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement