రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటోందని కేసీఆర్ అన్నారు. వనపర్తిలో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఎవరి జాతకాలు ఏంటో ఎన్నికల తరువాత తెలుస్తుందన్నారు. దేశంలో ప్రాంతీయపార్టీల హవా నడుస్తోందని, ఎన్డీయేకు 150, కాంగ్రెస్ 100 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. 16 మంది ఎంపీలను గెలిపిస్తే.. దేశ రాజకీయ గమనం మార్చుతామని, ఫెడరల్ ఫ్రంట్‌లో మనమే కీలకపాత్ర పోషిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.