రోడ్డుషోలో వ్యక్తి చెంప ఛెళ్లుమనిపించిన సీఎం! | Madhya Pradesh CM Shivraj Singh Chouhan slaps man during rally | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 16 2018 1:20 PM | Last Updated on Wed, Mar 20 2024 3:44 PM

ఎప్పుడూ శాంతంగా కనిపించే మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్‌ చౌహాన్‌ అనూహ్యంగా ఓ వ్యక్తి చెంప ఛెళ్లుమనిపించాడు. అదీ బహిరంగంగా అందరూ చూస్తుండగానే. ధార్‌ జిల్లా సర్దార్‌పూర్‌లో రోడ్‌షోలో ఈ ఘటన జరిగింది. రోడ్‌షోలో భాగంగా సీఎం చౌహాన్‌ ప్రజలతో కలిసి నడుస్తున్న సందర్భంలో తన సమీపంగా వచ్చిన ఓ వ్యక్తిని చెంప ఛెళ్లుమనిపించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ వ్యక్తిని దూరంగా తీసుకెళ్లారు. ఈ ఘటన కెమెరా కంటికి చిక్కంది. ప్రజల రద్దీ నడుమ పలువురు సీఎం చౌహాన్‌ ను దూరం నుంచి సెల్ఫీలు తీసుకుంటుండగా ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు కారణం ఏమిటి? సీఎం ఎందుకు ఆ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టాడు? అన్న వివరాలు తెలియరాలేదు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement