: హిందూ మహా సముద్రంలోని ద్వీప దేశం మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ను అరెస్ట్ చేసేలా లేదా అభిశంసించేలా ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలను పాటించకూడదంటూ పోలీసులు, భద్రతా దళాలను ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. ‘అధ్యక్షుణ్ని అరెస్ట్ చేయాలంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వు ఇస్తే అది అక్రమం. మాల్దీవుల రాజ్యాంగానికి విరుద్ధం. కాబట్టి అలాంటి ఉత్తర్వును అమలు చేయకూడదని నేను పోలీసులకు, ఆర్మీకి చెప్పాను’ అని అటార్నీ జనరల్ మహమ్మద్ అనిల్ ఆదివారం మీడియాకు చెప్పారు. గతంలో యమీన్ 9 మంది అసమ్మతి నేతలను జైలులో పెట్టించారు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి వెళ్లిన మరో 12 మందిపై అనర్హత వేటు వేశారు.
Published Mon, Feb 5 2018 12:27 PM | Last Updated on Wed, Mar 20 2024 3:36 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement