రామాయణంలో యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలను చంద్రబాబు, లోకేష్‌లు అడ్డుకుంటున్నారని మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చారిత్రక బిల్లులను అడ్డుకుని టీడీపీ శునకానందం పొందుతుందని మండిపడ్డారు. ‘40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారు. ఇచ్చిన మాట మీద నిలబడటం ఆయనకు అలవాటు లేదని’ పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు.