నిలోఫర్‌ కిడ్నాప్‌ కేసులో కొత్త ట్విస్ట్‌ | New Twist in Niloufer Kidnap Case | Sakshi
Sakshi News home page

నిలోఫర్‌ కిడ్నాప్‌ కేసులో కొత్త ట్విస్ట్‌

Published Wed, Oct 25 2017 5:09 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

నిలోఫర్ కిడ్నాప్ కేసులో మరో కొత్త కోణం బయటికొచ్చింది. శిశువును కిడ్నాప్‌ చేసిన మంజుల అనే మహిళ శిశువు తనకే పుట్టినట్టు భర్త కుమార్‌ గౌడ్, అత్త, బంధువులను నమ్మించింది. తనకు 5 నెలల క్రితమే అబార్షన్ అయినా భర్త, కుటుంబ సభ్యులకి ఈ విషయం తెలియనీయకుండా మంజుల జాగ్రత్తలు తీసుకుంది. బాబు పుట్టాడు అని భర్త కుమార్‌కు కిడ్నాప్‌ చేసిన రోజు ఫోన్ చేసి పేట్ల బురుజు ఆసుపత్రికి రప్పించింది. మంజుల మాటలను నమ్మి ఆసుపత్రికి వెళ్లి బాబుని తీసుకుని స్వగృహానికి కుమార్ గౌడ్ వచ్చాడు. సోమవారం ఉదయం బాబు చనిపోవడంతో తన బాబే చనిపోయినట్టు భావించి పూడ్చి పెట్టినట్లు పోలీసుల ఎదుట కుమార్‌ గౌడ్‌ చెప్పారు. తన భార్య మంజుల మోసం చేసిందని తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement