: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత పేర్ని నాని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు 40 సంవత్సరాల అనుభవం ప్రజలను మోసం చేయటానికి ఉపయోగపడిందని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో కోట్లు విలువ చేసే భూమిని లింగమనేని రమేష్! పవన్ కళ్యాణ్‌కు రూ.25 లక్షలకు ఇచ్చారని, తాము దానికన్నా మరో రూ.5 లక్షలు ఎక్కువగా ఇస్తాం పవన్ కళ్యాణ్ దాన్ని ఇస్తారా అని ప్రశ్నించారు.