సాక్షి, రంగారెడ్డి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తిని కడతేర్చి పొలంలో పాతిపెట్టారు అతని భార్య, కుమారుడు. ఈ సంఘటన చేవెళ్ల మండలం గుండాలలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కుటుంబ కలహాల నేపథ్యంలో నెలరోజుల క్రితం గుండాలకు చెందిన క్రిష్ణయ్య అనే వ్యక్తిని అతని భార్య, కుమారుడు హత్య చేశారు. అనంతరం శవాన్ని పొలంలో పాతి పెట్టారు. నెల రోజులుగా క్రిష్ణయ్య కనిపించకపోవటంతో బంధువులు అతని కోసం తీవ్రంగా గాలించారు.