ఎన్నికల పోలింగ్ ముగిసినా టీడీపీ నేతల ఆరాచకాలు ఆగడం లేదు. ఓడిపోతామనే అక్కసుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడులకు తెగబడ్డారు. కత్తులు, కర్రలతో స్వైరవిహారం చేస్తున్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు లక్ష్మారెడ్డి, నర్సిరెడ్డి, వెంకటేశ్వర్లపై టీడీపీ కార్తకర్తలు కత్తులతో దాడి చేశారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.