అధికారంలో ఉండగా పల్నాడు ప్రాంతంలో అరాచకాలకు పాల్పడిన టీడీపీ మాజీ ప్రజాప్రతినిధులు, వీటిని ప్రోత్సహించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ప్రశాంతతను చెదరగొట్టి చిచ్చు రగిల్చేందుకు చేస్తున్న యత్నాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పల్నాడుపై మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబుకు గత ఐదేళ్లలో సొంత పార్టీ నేతలు ఏడుగురిని హతమార్చడంతోపాటు విచ్చలవిడిగా దౌర్జన్యాలు సాగిస్తే కనిపించలేదా? అని ప్రజాస్వామ్యవాదులు నిలదీస్తున్నారు.