వైఎస్సార్ జిల్లా పులివెందులలో రాజకీయం వేడెక్కడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్ష నాయకుల సవాళ్లు, పతిసవాళ్ల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అణువణువు తనిఖీలు చేస్తున్నారు. పోలీసు దిగ్బంధంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనాన్ని పులివెందులలోకి రాకుండా పోలీసు బలగాలు అడ్డుకుంటున్నాయి.