జిల్లాలోని సిరికొండ మండలంలో దారుణం చోటుచేసుకుంది. గోప్యనాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న తండాలో సుజాత అనే మహిళ ఉరివేసుకుని ఆదివారం బలన్మరణానికి పాల్పడింది. అత్తింటివారు వేధింపులకు పాల్పడటంతోనే సుజాత ఆత్మహత్య చేసుకుందని ఆమె తరపు బంధువులు ఆరోపించారు. సుజాత భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. వారి ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. అయితే, విషయాన్ని గ్రహించిన మృతురాలి భర్త, అత్తామామలు అక్కడ నుంచి పరారీ కావడంతో ప్రమాదం తప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.