యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన తిరుకల్యాణోత్సవం వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 11 గంటలకు బాలాలయంలో స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం జరుగుతుంది. శ్రీరాముని అలంకరణలో హనుమంత సేవ నిర్వహిం చి 11గంటల కు గజవాహన సేవతో బాలాలయంలోకి పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురును తీసుకుని వస్తారు.