2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ.. విడగొట్టిన సోనియా గాంధీ అవినీతి అనకొండ.. ఈనాడు.. అందాల కొండ. నాడు గాడ్సే.. ఈ రోజు దేవత. ఆరోజు రాహుల్ గాంధీ వంటి మొద్దబ్బాయి కూడా దేశాన్ని పాలిస్తాడా? అని అడిగారు. ఇప్పుడు ఏమో మేధావి అంటున్నారు. వీరి రాజకీయాలు ఇంతగా దిగజారిపోయాయి. ఇదే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు అవినీతిపాలనపై రాహుల్ గాంధీ ఫొటోతో చార్జ్ షీట్ అనే పేరుతో బుక్ రిలీజ్ చేసింది. ఈ రోజు సిగ్గులేకుండా తెలంగాణ ఎన్నికల్లో జతకట్టింది. హరికృష్ణ భౌతికకాయం సాక్షిగా చంద్రబాబు.. కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌తో టీడీపీ-టీఆర్‌ఎస్‌ను కలిసి పోటీ చేస్తే బాగుంటుందని అడిగారు. దీనికి కేటీఆర్ మనమిద్దరం కలిసి ఉండడం కుదరదని స్పష్టం చేశారు.