ప్రజారోగ్య రంగంలో మరో విప్లవాత్మక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని ప్రజలందరికీ కంటి సమస్యలు దూరంచేయడానికి బృహత్తర కార్యక్రమం అమలు చేయనుంది. ప్రపంచ కంటిచూపు దినోత్సవం(అక్టోబర్ 10) సందర్భంగా ‘వైయస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ వేదికగా గురువారం ఉదయం 11.30 గంటలకు ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టునున్నారు.