వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే బ్రాహ్మణులకు సుముచిత స్థానం కల్పిస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖలోని సిరిపురంలో బ్రాహ్మణ సంఘాలతో వైఎస్ జగన్ సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.